పాయింట్ బ్లాంక్ లో తుపాకి.. నిమిషాల్లో చోరి.. Robbery at gunpoint in jewellery store of Allahabad

Uttar pradesh robbery at gunpoint in jewellery store of allahabad

Robbery In Allahabad, Robbery In uttar pradesh, Robbery In jewellery shop, buglary in uttar pradesh, buglary in jewellery shop, Robbery in jewelers store, robbery in allahabad, allahabad robbery, city news, allahabad news crime news

A CCTV footage captured an incident of robbery, which clearly shows how three people are looting a jewellers shop at gun point, in Allahabad city of Uttar Pradesh.

ITEMVIDEOS: పాయింట్ బ్లాంక్ లో తుపాకి.. నిమిషాల్లో నగల దుకాణం చోరి..

Posted: 02/28/2017 11:52 AM IST
Uttar pradesh robbery at gunpoint in jewellery store of allahabad

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదు నగరంలో దోపిడి దొంగలు అలజడి సృష్టించారు. పక్కాగా ప్రణాళిక వేసుకుని క్షణాల్లో దానిని అమలు చేసి డబ్బు, నగలతో పారిపోయారు. ముతూట్, మణ్ణపురం బంగారు తాకట్టు ఫైనాన్స్ లలో జరిగినట్టుగానే చకచకా వచ్చిన దోపిడి దోంగలు.. చటుక్కున తమ పని కానించి చిటికెలో పారిపోయారు. ఈ దొంగతం యావత్తు దుకాణంలోని సిసిటీవీ ఫూటేజ్ లో నిక్షిప్తమైంది. దుకాణయజమాని పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఫూటేజీని పరిశీలిస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ నగరంలో గల ఓ నగల దుకాణంలో దోపిడిదొంగల తాము వేసుకున్న ప్రణాలిక ప్రకారం ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు లోనికి ప్రవేశించారు. వారిని చూసి కస్టమర్లుగా భావించిన దుకాణ యజమాని అంతలోనే షాక్ కు గురయ్యారు. ముసుగుదోంగలు లోనికి వస్తూ దుకాణం యజమాని తలకు పాయింట్ బ్లాంక్ లో తుపాకిని గురిపెట్టడంతో ఆయనకు నోట మాటరాలేదు. ఇక అలస్యం చేయకుండా చకచకా తమ పనిని పూర్తి చేసుకుపోయారు దోంగలు.

దుకాణంలోకి ఒకేసారి ముగ్గురు ముసుగు దోంగలు లోనికి ప్రవేశించడంతోనే ఒకరు దుకాణం యజమాని తలకు తుపాకి పెట్టారు. అదే అదునుగా చేసుకున్న మిగిలిన ఇద్దరు దొంగలు దుకాణం నుంచి అందినకాడికి బంగారు అభరణాలు, నగదు దోచుకెళ్లారు. అనంతరం ముగ్గురూ అక్కడ నుంచి నిమిషాల్లో పారిపోయారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫొటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అత్యంత తక్కువ నిడివి గల ఈ ఫూటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cctv footage  gun point  Robbery  burglary  Allahabad  jewelers store  uttar pradesh  crime  

Other Articles