టీడీపీలో ఎమ్మెల్సీ చిచ్చు.. జగన్ అప్ సెట్ | Jagan Upset with CBN MLC Plan

Ysrcp mlc plan utter flop

YSRCP MLC Elections, Kurnool TDP Politics, Chandrababu Naidu Kurnool Clashes, Kurnool MLC Elections, Jagan MLC Master Plan, Shilpa Brothers TDP, YSRCP Proposal TDP, Kurnool TDP Clashes, TDP MLC Candidates

YSRCP Master plan to create rucks in Kurnool TDP. YS Jagan Using it over MLC Elections. But Chandrababu carefully Handle it.

వైసీపీ ‘ఎమ్మెల్సీ’ ఫ్లాన్ అట్టర్ ఫ్లాప్

Posted: 02/28/2017 09:40 AM IST
Ysrcp mlc plan utter flop

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి టైం కలిసి రావటం లేదు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు చేస్తున్న యత్నాలు ఒక్కోక్కటిగా విఫలమవుతూ వస్తున్నాయి. ఓవైపు తనకు హ్యాండిచ్చి టీడీపీలో చేరిన 21 మంది జంపర్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కోడెలకు బహిరంగ లేఖ రాసిన జగన్, తెరవెనుక ప్రయత్నాలు కూడా చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికలను అస్త్రాలుగా చేసుకుని కీలక నేతలను పార్టీకి దూరం చేయాలని ఫ్లాన్ వేశాడు.

ఇందుకోసం కర్నూలు టీడీపీ రాజకీయంలో కల్లోలం రేపేందుకు యత్నించిన జగన్ కు పెద్ద షాకే తగిలింది. శిల్పా-భూమా వర్గాల మధ్య అగాధం పెంచేందుకు ఆయన వేస్తున్న ఎత్తులు వారిని మరింత దగ్గర చేస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నుంచి గౌరు వెంకటరెడ్డిని ఈ జిల్లా నుంచి బరిలోకి దించాలని జగన్ నిర్ణయించాడు. అదే సమయంలో టీడీపీకి వైసీపీ నాయకత్వం లోపాయికారీగా ఓ ప్రతిపాదన పంపింది. వెంకటరెడ్డి బావమరిది శివానందరెడ్డికి టికెట్ ఇస్తే వెంకటరెడ్డిని బరి నుంచి తప్పించి, పోటీని ఏకగ్రీవం చేస్తామనేది దాని సారాంశం.

శివానందరెడ్డి కనుక ఎమ్మెల్సీ అయితే భవిష్యత్తులో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు అందించారు. తద్వారా కీలక నేత శిల్పా చక్రపాణిరెడ్డికి టికెట్ రాకుండా చేయాలన్నది వైసీపీ ప్లాన్‌. ఇప్పటికే భూమా తో పొసగని క్రమంలో, ఒకవేళ టికెట్ రాకుండా చేస్తే శిల్పా సోదరులు చంద్రబాబుపై అలిగి పార్టీని వీడుతారని, తద్వారా టీడీపీని భారీగా దెబ్బ కొట్టోచ్చని వైసీపీ నేతలు అంచనా వేశారు.

కానీ, వైసీపీ ప్రతిపాదనలోని మర్మాన్ని గ్రహించిన చంద్రబాబు.. చక్రపాణిరెడ్డినే పోటీలో నిలుపుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడితో మాట్లాడి శిల్పా పోటీని కన్ఫర్మ్ చేశారు. వెంటనే కర్నూలు వెళ్లి అందరినీ కలిసి విషయాన్ని వివరించాలని, సమన్వయం చేయాలని ఆదేశించారు. ఆయన వెంటనే కర్నూలు చేరుకుని భూమా, శిల్పా వర్గీయులను పిలిపించి మాట్లాడారు. వైసీపీ ప్లాన్ వివరించారు. ఆ తర్వాత శిల్పా సోదరులు, భూమా నాగిరెడ్డి, ఆయన బావమరిది ఎస్వీ మోహనరెడ్డి, కుమార్తె అఖిలప్రియ తదితరులంతా కలిసి అచ్చెన్నాయుడు సమక్షంలో కూర్చుని మాట్లాడుకున్నారు. అనంతరం ఇదే సమావేశానికి శివానందరెడ్డిని కూడా పిలిపించి మాట్లాడడంతో అపోహలు పటాపంచలయ్యాయి. అలా జగన్ మాస్టర్ ప్లాన్ కు మరోసారి చెక్ పడినట్లయ్యింది.

ఇక తుది అభ్యర్థుల జాబితాను ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.కళావెంకట్రావు ప్రకటించారు. దాని ప్రకారం..

శ్రీకాకుళం : శత్రుచర్ల విజయరామరాజు
తూర్పుగోదావరి : చిక్కాల రామచంద్రరావు
పశ్చిమగోదావరి : అంగర రామ్మోహన్‌, మంతెన సత్యనారాయణరాజు
నెల్లూరు : వాకాటి నారాయణరెడ్డి
కర్నూలు : శిల్పా చక్రపాణిరెడ్డి
చిత్తూరు : రాజసింహులు (దొరబాబు)
అనంతపురం : దీపక్‌రెడ్డి
కడప : బీటెక్‌ రవి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  MLC Election  Kurnool TDP  Chnadrababu Naidu  

Other Articles