దాదాను కలిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? | OPS faction MPs to meet President.

Panneerselvam demands president rule in tamil nadu

OPS President Rule, AIADMK Rebel MPs, AIADMK Leaders President, Panneerselvam President Pranab Mukherjee, Pranab Mukherjee Panneerselvam President Pranab Mukherjee

A delegation of 12 MPs, owing allegiance to rebel AIADMK leader O Panneerselvam, will meet President Pranab Mukherjee. Requested President Rule in Tamil Nadu and seek probe on Jayalalithaa's Death.

రాష్ట్రపతి పాలన విధించి తీరాల్సిందే!

Posted: 02/28/2017 10:32 AM IST
Panneerselvam demands president rule in tamil nadu

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన పంతం వీడటం లేదు. ఎలాగైనా శశికళ వర్గాన్ని ఇరకాటంలో పెట్టాలని యత్నిస్తున్నాడు. అందుకోసం ఉన్న అన్ని మార్గాలను వాడుకోవాలని చూస్తున్నాడు. తిరుగుబాటు సమయంలో తనకు మద్ధతుగా నిలిచిన 12 మంది ఎంపీలతో నేడు రాష్ట్రపతి వద్దకు వెళ్లనున్నాడు.

ఇప్పటికే అపాయింట్ మెంట్ దొరకగా ఇక్కడి పరిస్థితులను వివరించి రాష్ట్రపతి పాలన విధించాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జయలలిత మృతిపై ఉన్నతశ్రేణి విచారణ జరిపించాలని విజ్నప్తి చేసే అవకాశం ఉంది. బలనిరూపణ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాలు రాష్ట్రపతికి తెలయజేసి డీఎంకే కూడా డిమాండ్ చేస్తుండటంతో మరోసారి దానికి అవకాశం ఇచ్చేలా ఆదేశించాలని కోరనున్నట్లు సమాచారం.

మరోవైపు బాధ్యతలు స్వీకరించి పట్టుమని పదిరోజులు కూడా కాకముందే పళనిస్వామి పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శశికళ, ముగ్గురు ముఖ్యులైన మంత్రులను జైలుకు వద్దకు వచ్చి కలవాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. చిన్నమ్మ పిలుపుతో మంత్రులు సెంగొట్టయ్యన్, బాలకృష్ణారెడ్డి, దిండిగల్ శ్రీనివాసులు ఇప్పటికే బెంగళూరుకు చేరుకోగా, పరప్పణ అగ్రహార జైల్లో కాసేపట్లో ఆమెతో భేటీ కానున్నారు కూడా.

తమిళనాడులో దీప నేతృత్వంలో కొత్త పార్టీలు మొదలు కావడం, పన్నీర్ సెల్వంకు అనుకూలంగా అక్క కొడుకు దినకరన్ వ్యాఖ్యలు చేయటం తదితరాలపై వీరి మధ్య చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ రభసపై ముఖ్యమంత్రికి హైకోర్టు పంపిన నోటీసుల గురించి కూడా వీరు శశికళకు వివరించి సలహాలు పొందనున్నట్టు భోగట్టా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : OPS  President  Pranab Mukherjee  Panneerselvam  AIADMK Rebel Leaders  

Other Articles