అది ఇస్తే ఏ పార్టీలో అయినా చేరతా: జయప్రద | Jayaprada on Her Political Life.

Jayaprada not interest to return samajwadi

Actress Jayaprada politics, Jayaprada BJP, Jayaprada Samajwadi Party, Jayaprada Narendra Modi, Modi Jayaprada, Jayaprada BJP, BJP Jayaprada, Expelled SP Leader BJP, Jayaprada New Party, Jayaprada Doneky Comments, Jayaprada on SP Split, Jayaprada on Demonetization

Expelled Samajwadi Party leader Jayaprada hails demonetisation and PM Narendra Modi. Clarified that she will never returns to Samajwadi party.

జయప్రద మహిళలను అవమానించే పార్టీలోనా?

Posted: 02/28/2017 09:01 AM IST
Jayaprada not interest to return samajwadi

నటి, సమాజ్‌వాదీ పార్టీ బషిష్కృత నేత జయప్రద యూపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అఖిలేష్ పాలనలో ఉత్తరప్రదేశ్ గూండారాజ్‌గా మారిపోయిందని ఆమె పేర్కొన్నారు. షిర్డీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు గౌరవం లేని సమాజ్ వాదీ పార్టీలో తప్ప తాను ఏ పార్టీలో అయినా చేరేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే రావని హామీ ఇస్తేనే చేరతానని ఈ మాజీ ఎంపీ చెబుతోంది.

ముఖ్యంగా మహిళల పట్ల ఒకింత గౌరవం కూడా లేకుండా అసభ్య కామెంట్లు చేసే అజంఖాన్ లాంటి నేతలు ఉన్న ఎస్పీలో తాను తిరిగి చేరే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేసింది. ఇక ప్రధానిని ఉద్దేశించి అఖిలేష్ గాడిద అని సంభోదించటం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. నోట్ల రద్దులాంటి కీలక నిర్ణయం దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్న మోదీ గురించి అలాంటి వ్యాఖ్యలు సబబు సరికాదని, ప్రధాని స్థాయి వ్యక్తిపై అలాంటి దిగజారుడు వ్యాఖ్యలు సరికాదని ఆమె తెలిపింది.

ఇక సమాజ్ వాదీ అధినేతలతో వైరం ఉందా? అన్న ప్రశ్నకు. ములాయం సింగ్ యాదవ్ తనకు తండ్రిలాంటి వాడని, అఖిలేష్ తన సోదరుడన్న ఆమె వారి మధ్య అంతరాలు రావటం బాధాకరమని తెలిపింది. అమిత్ షా తో రహస్య సంప్రదింపులు, పైగా మోదీని ప్రశింసిస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో త్వరలో ఆమె కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayaprada  Politics  BJP  Narendra Modi  Samajwadi Party  

Other Articles

Today on Telugu Wishesh