కేఏ పాల్ బంఫరాఫర్... ట్రంప్ నే గెలిపించా.. నువ్వెంత! | KA Paul ready for campaign to Nara Lokesh If contesting as MLA.

Ka paul bumper offer to nara lokesh

KA Paul Nara Lokesh, KA Paul Donald Trump, Trump Nara Lokesh, Nara Lokesh KA Paul, KA Paul Bumper Offer, KA Paul Tweet, Evangelist K A Paul

KA Paul responsed on Nara Lokesh MLC contesting. Paul could get help US president Donald Trump get elected, he can as well help Lokesh win the MLA seat in the assembly elections

ట్రంప్ ఎలాగో.. చినబాబు కూడా అలాగేనంట!

Posted: 02/28/2017 08:10 AM IST
Ka paul bumper offer to nara lokesh

ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా ఎమ్మెల్సీ అయి ఆపై మంత్రి వర్గంలోకి చేరేందుకు నారా లోకేష్ సర్వం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కూడా ఎలక్షన్ ద్వారా కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక అవుతుండటంపై కాస్త విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తాను బ్యాక్ డోర్ రాజకీయాలకు దూరమని ప్రకటించిన చినబాబు ఇప్పుడు ఇలా చేయటం ఏంటని కార్యకర్తల్లో కూడా ఒకరకమైన అసంతృప్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో సోమవారం పొలిట్ బ్యూర్ నిన్న ఎమ్మెల్సీ గా లోకేష్ పేరును ప్రతిపాదించటం, అందుకు తగ్గట్లే వారికి కృతజ్నత చెబుతూ ఓ ట్వీట్ వేయటం చూశాం. ఇక దానిపై ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కేఏపాల్ స్పందించాడు. ఎన్నికలలో పోటీ చేసి, ఎమ్మెల్యేగా రావాలని అందులో సూచించారు. లోకేశ్ తరపున తాను ప్రచారం చేస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రచారం చేసినట్టుగానే లోకేశ్‌కు కూడా చేస్తానని, వెనక్కు తగ్గద్దని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వంలోకి అడుగుపెట్టాలేగానీ, ఎమ్మెల్సీగా రావాల్సిన అవసరం ఏముందని, ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడంటూ ప్రతిపక్షాలు దానిని అన్వయించుకుంటున్నాయి. అయితే ట్రంప్ ను గెలిపించిన(చెప్పుకుంటున్నాడు) ఈ గొప్ప వ్యక్తి తలుచుకుంటే ఎమ్మెల్యే ఏంటి ఏకంగా సీఎం కూడా అవుతాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.  ఏది ఏమైనా పాల్ గారి ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అన్నట్లు తన బోయింగ్ విమానం సమస్య రావటంతో సమంత, చైతూల పెళ్లికి హాజరుకాలేకపోయానని కూడా ఈయనగారు ట్వీట్ చేయటం గురించి వింత చర్చ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KA Paul  TDP  Nara Lokesh  MLC Elections  

Other Articles