వీడియో: కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం | Eight Died in Private travels bus accident Krishna.

Private travel bus overturns near krishna district

Private Travel Bus, Travel Bus Accident, Diwakar Travel Bus Accident, Private Tracel Culvert Accident, Krishna District Private Travel Accident, Private Travel Bus Accident, Bus Accident In Krishna, Andhra Pradesh Bus Acident, 8 Killed Road Accident

Diwakar Travel Bus Overturns 8 died in spot, 30 Injured in Krishna District. Police concluded that Driver negligence cause for this accident.

ITEMVIDEOS:ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా.. 8 మంది మృతి

Posted: 02/28/2017 07:38 AM IST
Private travel bus overturns near krishna district

ఆంధ్రప్రదేశ్ లో రహదారి మరోసారి నెత్తురొడింది. కృష్ణా జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద అదుపుతప్పి కల్వర్టులో పడింది. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నందిగామ, జగ్గయ్యపేట ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

రహదారిపై నుంచి బస్సు ఒక్కసారిగా కిందపడడంతో అది కల్వర్టు లో పడిపోయింది. దీంతో ప్రయాణికులను బయటకు తీయడం కష్టంగా మారింది. డ్రైవర్ నిద్రమత్తులో బస్సును అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సరిగ్గా రెండు కల్వర్ట్ ల మధ్యలో ఇరుక్కుపోవటంతో చర్యలు కష్టంగా సాగుతున్నాయి. నీళ్లు లేకపోవటంతో ప్రమాద తీవ్రత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఇక మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందటంతో ఆ సంఖ్య 10కి చేరింది.

ఇక ఆదాయ సముపార్జనే పరమావధిగా ప్రైవేటు ట్రావెల్స్ ఎలా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాయో మరోసారి తేటతెల్లమైంది. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఈ ఏసీ బస్సులో డిక్కీలో సైతం ఓ వ్యక్తి ప్రయాణిస్తుండటం గమనార్హం. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు పూర్తిగా నిండిపోవడంతో అతన్ని డిక్కీలో కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు డిక్కీలో వ్యక్తిని చూసి అవాక్కయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diwakar Travel Bus  Accident  Krishna District  

Other Articles