ఇస్రో రికార్డు ప్రయోగంతో మనకే పెను ముప్పు!... | ISRO 104 Satellites launch most dangerous.

Isro ex chairman says record satilites launch create space debris

G Madhavan Nair, ISRO Ex Chairman Sensational Comments, ISRO 104 Satellites Launch, Indian Space Research Organisation Record, PSLV Mission Useless, Madhavan Nair 104 Satellites, Madhavan Nair ISRO Record, Madhavan Nair Warn

Buried in the flood of congratulatory messages that the Indian Space Research Organisation (ISRO) received after its recent space feat is one discordant note raising some concern. It is from none other than G Madhavan Nair, the former chairman of the country's premier space body. Nair, during whose term the agency launched the Chandrayaan mission to the Moon, feels ISRO's latest Polar Satellite Launch Vehicle (PSLV) mission potentially has some hidden dangers to its own space assets.

ఇస్రో రికార్డు ఓ ‘చెత్త’ ప్రయోగం: మాజీ చైర్మన్

Posted: 02/27/2017 09:42 AM IST
Isro ex chairman says record satilites launch create space debris

అంతరిక్ష పరిశోధనల్లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అద్భుత ప్రయోగంగా 104 ఉపగ్రహాలను సింగిల్ రాకెట్ ప్రయోగంతో కక్ష్యలో నిలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి విజయవంతం చేసిన ఈ ప్రయోగంపై మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రయోగంతో భారత్ కు భవిష్యత్తులో పెను ముప్పు పొంచి ఉందంటూ పెను కలకలమే రేపాడు.

ఇస్రోకు 400 ఉపగ్రహాలనైనా ఒకేసారి ప్రయోగించే సత్తా ఉందని అభినందించిన ఆయన, ఇప్పుడు ఈ తరహా ప్రయోగాలు సరికాదని హితవు పలికాడు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా ఇస్రో ముందడుగు వేసిందని, ఈ 104 ఉపగ్రహాల్లో మూడు మాత్రమే భారత్ వని గుర్తు చేసిన ఆయన, డబ్బుల కోసం ఇష్టానుసారం ఉపగ్రహాలను పంపరాదని సలహా ఇచ్చారు. నానో ఉపగ్రహాల జీవితకాలం స్వల్పమని చెప్పిన ఆయన, ఆపై ఇవన్నీ అంతరిక్షంలో వ్యర్థాలుగా(చెత్తగా) మారుతాయని, నియంత్రణ లేక దిశారహితంగా తిరుగుతూ ఉంటాయని, ఒక్కోసారి పనిచేస్తున్న ఉపగ్రహాలను ఢీకొట్టే ప్రమాదముందని హెచ్చరించారు.

అటువంటప్పుడు కోట్లాది రూపాయల ధనం పనికిరాకుండా పోతుందని, భారత అవసరాల కోసం పంపిన శాటిలైట్లు సైతం నిరుపయోగం కావచ్చని అభిప్రాయపడ్డారు. స్వప్రయోజిత శాటిలైట్ల ప్రయోగం చేస్తేనే మంచిదన్న ఆయన, భవిష్యత్తులో విదేశీ ఉపగ్రహాలను పంపకపోవటమే మంచిదని సూచిస్తున్నాడు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇస్రో స్పందించేందుకు నిరాకరించింది. 2014 లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ఓ భారీ శాటిలైట్ ఇలాంటి స్పేస్ వ్యర్థాల వల్లే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుందన్న ఉదాహరణను కూడా ఆయన చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  EX Chairman G Madhavan Nair  104 Satellites launch  Danger  

Other Articles