శశికళే కొట్టి చంపింది.. నిజమైన ద్రోహి సెల్వమేనంట! | Stalin slams OPS on Jayalalithaa's death probe.

Stalin doubts on pannerrselvam loyalty on jayalalithaa

Jayalalithaa's Death, Stalin Panneerselvam Loyalty, Stalin Slams OPS, DMK Head Stalin, Stalin Vaiko, Stalin Panneerselvam, Panneerrselvam Group, C Ponnayan Sasikala

Stalin slams OPS as Selfish for not looking into Jayalalithaa's death while in Power. AIADMK ousted member Ponnayan says Sasikala beat Jayalalithaa in Poes Garden.

పన్నీర్ కు ఆ డౌట్ ఎందుకు రాలేదంటే...

Posted: 02/27/2017 11:11 AM IST
Stalin doubts on pannerrselvam loyalty on jayalalithaa

జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వంకు ఆ టైంలో అమ్మ మృతిపై ఎలాంటి అనుమానాలు రాకపోవటం ఏంటని ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ తీవ్ర విమర్శలు కురిపించాడు. అమ్మ చనిపోయిన రెండు నెలలకు, అది కూడా తాను సీఎం కుర్చీ దిగిపోవాల్సిన సమయం నుంచే జయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేయటం సరిగ్గా లేదని స్టాలిన్ చెబుతున్నాడు. పోనీ సీఎంగా ఉన్న సమయంలోనే విచారణ జరిపించి ఉండొచ్చు కదా? అని ప్రశ్నించాడు.

ఓపీఎస్ దివంగత జయలలిత పేరును వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడని స్టాలిన్ విమర్శించాడు. అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలటంతో బతికుంటే పురుచ్ఛితలైవి కూడా శిక్ష పడేదని, అందుకే ప్రభుత్వ పథకాల నుంచి ఆమె పేరును తొలగించాలని గత కొద్దిరోజులుగా డీఎంకే డిమాండ్ చేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పన్నీర్ స్టాలిన్ పై విరుచుకుపడ్డాడు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ పన్నీర్ కు రిటార్ట్ ఇచ్చాడు.

అమ్మను చిన్నమ్మే చంపింది: పొన్నియన్

ఇదిలా ఉంటే తమిళనాడు మాజీ మంత్రి, పన్నీర్ వర్గానికి చెందిన అన్నాడీఎంకే నేత పొన్నయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితను శశికళ కొట్టడం వల్లే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటివద్ద ఆదివారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆస్పత్రిలో జయలలిత రెండు నెలలకుపైగా చికిత్స తీసుకున్నప్పటికీ ఆమెను చూసేందుకు మాత్రం ఎవరినీ అనుమతించలేదన్నారు. చివరికి అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని కూడా ఆస్పత్రిలో అడుగుపెట్టనీయలేదని గుర్తు చేశారు.

పేషెంట్ కి ఇన్ఫెక్షన్ వస్తుందన్న పేరుతో కీలక నేతలెవరనీ ఆస్పత్రిలో అడుగుపట్టనీయలేదని పేర్కొన్న పొన్నయన్.. శశికళ మాత్రం జయ గదిలో ఎందుకున్నారని ప్రశ్నించారు. జయ ఆస్పత్రిలో చేరడానికి ముందే ఇంట్లో ఆమెపై దాడి జరిగిందంటున్నాడు. ఈ కారణంగానే ఆమె ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చేరారన్నారు. అపోలో వైద్యులు కూడా జయ విషయంలో రహస్యాలు పాటించడాన్ని చూస్తే శశికళకు, వారికి మధ్య రహస్య ఒప్పందం ఏదో జరిగిందని అనిపిస్తోందని ఆరోపించాడు. జయలలిత మృతిపై న్యాయ విచారణ కోసం కమిషన్‌ను నియమించాలని పొన్నయన్ డిమాండ్ చేస్తున్నాడు.

ఇంకోపక్క సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో జయ చేరే సమయానికే ఆమె నాడీ కొట్టుకోవటం ఆగిపోయిందని(అప్పటికే చనిపోయిందని) ప్రచారం చేసిన ఓ న్యూట్రిషియనిస్ట్ కు చిక్కులు ఎదురయ్యాయి. పెరంబూర్ కు చెందిన రామా సీతా అనే మహిళను అపోలో ఆస్పత్రి మేనేజ్ మెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : C Ponnayan  Sasikala Natarajan  OPS  Stalin  Jayalalithaa's Death  

Other Articles