తెల్ల తూటాలకు తెలుగోళ్లే బలి కావాలా? | Racism and Xenophobia have place in America

Series of tragedies to hit telugus in us

Srinivas Kuchibhotla Kill, Racism In America, US Telugu Tragedies, Hate Crime America, Indian Shot Dead, American Racial Slurs, Kansas Shooting, Telugu NRI US, US Telugu People

The killing of Srinivas Kuchibhotla has come as yet another blow to the Telugu community in the US and has focused attention on a series of tragedies that have struck immigrants from Telangana and Andhra Pradesh in recent times.

30 మంది తెలుగోళ్లను చంపేశారు!

Posted: 02/27/2017 08:56 AM IST
Series of tragedies to hit telugus in us

అమెరికాలోని కాన్సస్ కాల్పుల ఘటనతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో మరోమారు గబులు రేగింది. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా జాతివివక్షత మరోసారి పడగ విప్పటంతో అక్కడి తెలుగువారు ఆందోళనకు గురి అవుతున్నారు. ఓవైపు వీసా నిబంధనలతోపాటు, మరోపక్క ఇలాంటి దారుణ దాడులు జరుగుతుండటంతో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలసలు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.

ఇక 2008 నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు ఆరేళ్లలో 30 మంది తెలుగువారు అగ్రరాజ్యం నేలపై దుర్మరణం పాలయ్యారు. వీరిలో విద్యార్థులు, టెక్కీలు అధికంగా ఉండగా, అత్యంత దారణమైన ఘటనలు ఓ పది వరకు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే... ఫిబ్రవరి 10, 2017న వరంగల్‌కు చెందిన మామిడాల వంశీరెడ్డిని కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో ఓ దుండగుడు కాల్చి చంపాడు. జూలై 2016లో హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్(25)‌ను ఆస్టిన్‌లో అతడి రూమ్మేటే కాల్చి చంపాడు. జూన్ 2015లో హైదరాబాద్‌కే చెందిన ఎంఎస్ సాయికిరణ్ ఫ్లోరిడాలో దుండగుల కాల్పుల్లో బలయ్యాడు. అడిగిన వెంటనే ఫోన్ నంబరు ఇవ్వలేదనే కారణంతో దుండగుడు ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈలప్రోలు జయచంద్ర(22) 2014లో టెక్సాస్ సమీపంలో దుండగుల కాల్పులకు బలయ్యాడు.

ఇక ఇప్పుడు దేశం విడిచివెళ్లాలంటూ ఓ వ్యక్తి 32 ఏళ్ల కుచిబోట్ల శ్రీనివాస్ ను అతిదారుణంగా చంపిన విషయం తెలిసిందే. అమెరికాలో తెలుగువారిపై జరిగిన హత్యల్లో ఇవి కొన్ని మాత్రమే. అయితే తాజా దాడి వెనుక వ్యక్తిగత వివాదాలేనా లేక నిజంగా జాతి వివక్షత ఉందా అన్న అనుమానాలను పక్కనపెడితే... ప్రస్తుతం సుమారు 6,00,000 మందికి పైగా తెలుగు వారి భద్రతా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే తానా లాంటి తెలుగు సంఘాలు మనోళ్ల సంక్షేమం కోసం రంగంలోకి దిగినప్పటికీ, మరోవైపు తమ తరపున కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై బలంగా ఉంది.

 

మరో జాతి విద్వేష దాడి...

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాతి విద్వేష దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై దాడికి దిగిన గుర్తుతెలియని వ్యక్తులు కొందరు గోడలపై కోడిగుడ్లు విసిరి, కుక్కల అశుద్ధం పూసి, విద్వేష వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు అంటించారు. 'గోధుమ రంగు చర్మం వాళ్లు, లేదా భారతీయులు ఇక్కడ ఉండొద్దు' అంటూ పోస్టర్లపై రాశారు. ఇక ఈ దాడికి గురైన భారత సంతతి వ్యక్తి, తన పేరును బయటపెట్టేందుకు ఇష్టపడలేదు.

అందరు అమెరికన్లూ ఇలాంటివారు కాదని, తన ఇంటి గోడలను శుభ్రం చేయడానికి చుట్టుపక్కల వాళ్లు సాయపడ్డారని చెప్పాడు. అయితే, మరోసారి దాడి జరగవచ్చని భయపడుతున్నట్టు వెల్లడించాడు. కాగా, ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు, ఇది ఒకరిద్దరి పని అయివుండదని, పెద్ద సమూహమే వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

మరోవైపు ఓ ఇండియన్ యువతిని బండ బూతులు తిడుతూ అవమానించిన వీడియో ఒకట ినెట్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 

న్యూయార్క్ మెట్రో రైల్ లో ప్రయాణిస్తున్నసదరు యువతిని ఇద్దరు దుండగలు తెగ తిడుతూ ఉండగా వీడియో తీశారు. ప్రస్తుతం యువతి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  Telugu People  Shot Dead  Racism  Hate Crimes  

Other Articles