భార్యభర్తల మధ్య శృంగారానికి పెయిడ్ బ్రేక్.. ! Swedes should take sex breaks at work, says politician

Swedish councillor proposes one hour paid sex breaks to improve workers happiness

Per Erik Muskos, Personal relationships, Sweden, Paid breaks, wife and husband sex, office, jobs, orklife, working in sweden, övertorneå, news

Per-Erik Muskos, a city official for the town of Overtornea, proposed the motion, that Per-Erik Muskos, a city official for the town of Overtornea, proposed the motion

భార్యభర్తల మధ్య శృంగారానికి పెయిడ్ బ్రేక్.. !

Posted: 02/22/2017 05:27 PM IST
Swedish councillor proposes one hour paid sex breaks to improve workers happiness

టెలీ కమ్యూనికేషన్ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులతో రోజుకు ఇరవై నాలుగు గంటల సమయం వున్నా సరిపోవడం లేదు. అలా అని సమయాన్ని పొడిగించలేం కదా. అయితే ఈ సమస్య భార్యభర్తల మధ్య సంసార జీవినానికి కూడా అంతరాన్ని పెంచుతుందట. దీంతో కార్యాలయాలకు వచ్చిన వారు తమ పనులలో అంత శ్రధ్ద, ఏకాగ్రతను చూపడం లేదట. అయితే ఇందుకోసం ఓ కౌన్సిలర్ మంచి ఐడియాను ప్రతిపాదించారట. అదేంటంటే దాంపత్య జీవనానికి బ్రేకులు పడకుండా ఇకపై గంట పాటు పెయిడ్ బ్రేక్ ఇవ్వాలని ప్రతిపాదన సారాంశం.

అయితే ఇది మన భారత దేశంలోని సమస్య కాదండోయ్. పూర్తిగా విదేశీ సమస్య. అందులో కూడా స్వీడన్ దేశంలని ఉత్తర ప్రాంతానికి చెందిన ఓవర్ టోర్నియాకు చెందిన కౌన్సిలర్ పర్ ఎరిక్ ముస్కోస్ ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. టెక్నాలజీ ప్రస్తుత ఆధునిక సమాజంలో భార్యాభర్తల మధ్య పెద్దగా సన్నిహిత అనుబంధం ఉండటం లేదని, పని ఒత్తిడి, సెల్‌ ఫోన్‌, సోషల్‌ మీడియా వంటి వాటి వ్యాపకంతోనే సమయమంతా గడిచిపోతోందని ఆయన చెప్పుకోచ్చారు.

అందుకని భార్యాభర్తల మధ్య ప్రణయ ఏకాంతానికి అదేనండీ శృంగారానికి తీరికే ఉండటం లేదని.. దీంతో వారు కార్యాలయాలకు వెళ్లినా అక్కడ అంత శ్రద్దగా పనులు నిర్వహించడం లేదన్నారు. వారిలో ఏకాగ్రత లోపించడంతో పనులు కూడా సజావుగా సాగడం లేదని చెప్పారు. అందుకనే ఒక అరుదైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చానన్నారు. ఉద్యోగులకు పనివేళలో ఒక గంటపాటు పెయిడ్‌ బ్రేక్‌ (వేతన విరామం) ఇస్తే.. ఆ సమయంలో వారు ఇంటికి వెళ్లి తమ భాగస్వాములతో శృంగారంలో పాల్గొనేందుకు వీలుంటుందని ఆయన ప్రతిపాదించారు.

శృంగారం ఎంతో ఆరోగ్యకరమైనదని అనేక అధ్యయనాలు సూచిస్తున్న నేపథ్యంలో తాను ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినట్టు 42 ఏళ్ల పెర్‌ ఎరిక్‌ మస్కోస్‌ తెలిపారు. ప్రస్తుతం జంటలు ఒకరితో ఒకరు సన్నిహితంగా ఎక్కువ సమయం గడపడం లేదని, ఈ నేపథ్యంలో వారి మధ్య సన్నిహిత అనుబంధం ఉండటం ఎంతో మంచిదని ఆయన తన ప్రతిపాదన తీర్మానాన్ని కౌన్సిల్‌లో ప్రవేశపెడుతూ పేర్కొన్నారు. ఉద్యోగులు తమకు కేటాయించిన పెయిడ్‌ బ్రేక్‌ను భాగస్వాములతోనే గడుపుతున్నారా? లేక వేరే పనులకు ఉపయోగిస్తున్నారా? అన్నది గుర్తించడానికి ఎలాంటి మార్గం లేదని, అయినా ఉద్యోగులపై నమ్మకం ఉంచి కంపెనీలు ఈ విరామం ఇస్తే మంచిదని ఆయన సూచించారు. తన తీర్మానం తప్పకుండా కౌన్సిల్‌ ఆమోదం పొందుతుందని మస్కోస్‌ ధీమాతో ఉన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles