అమ్మాయి డ్రెస్సు చించి చేతులేస్తే... చెయిన్ మాత్రమే లాగాడంటున్నారే! | Air hostess alleges molestation cops says chain-snatching.

Air hostess alleges molestation in bangalore

Bangalore Air Hostess, Air Hostess Molestation, Air Hostess Strip, Bangalore Molestation, Bangalore Woman Strip, Air Hostess Strip Forcibly, Air Hostess Molestation, HBRR Molestation

A woman said to be an air hostess with Jet Airways was reportedly molested by a motorcyclist when she was walking back from a fast food restaurant along with a friend in HRBR Layout, east Bengaluru. However, Cops claimed that it could be a case of attempted chain-snatching. “The man laid his hand around her neck and tried to grab the chain. She was not molested.

లైంగిక వేధింపులు కాదు.. దొంగతనం?

Posted: 02/22/2017 10:09 AM IST
Air hostess alleges molestation in bangalore

కొ్త్త సంవత్సరం రోజున బెంగళూరు లో జరిగిన దాషీక్టం గురించి ఇంకా చర్చలు జరుగుతు ఉంటే మధ్యలో అలాంటి ఉదంతాలు చాలానే వెలుగు చూశాయి. ఇంత కాలం దేశ రాజధానికే పరిమితం అయ్యాయనుకున్న లైంగిక వేధింపులు అంతటా విస్తరించాయని అర్థమయ్యింది. ఏది ఏమైనా హైటెక్ నగరంగా పేరున్న బెంగళూర్ లో ఇలాంటి వికృత చేష్టలు రాను రాను పెరిగిపోతూనే ఉన్నాయి.

ఈ మధ్యే బెంగళూర్ లో అత్యంత విలాసవంతమైన ప్రాంతం హెచ్ బీ ఆర్ ఆర్ లేఅవుట్ లో ఓ ఎయిర్ హోస్టెస్ పై ఓ యువకుడు లైంగిక దాడి యత్నం చేయటం తీవ్ర దుమారం రేపింది. ఫిబ్రవరి 12న తన స్నేహితురాలితో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది 22 ఏళ్ల యువతి. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోర్త్ బీ క్రాస్ రోడ్డుకు చేరుకోగానే బైక్ పై హెల్మెట్ తో వచ్చిన ఓ ఆగంతకుడు ఆమె టాప్ ని చించేసి అస్యభకరంగా ప్రవర్తించాడు. అయితే వెంటనే ఆ ఇద్దరు యువతులు గట్టిగా అరవటంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు.

ఇంతలో అటుగా వచ్చిన పోలీస్ వ్యాన్ వీరిని గమనించి ఫిర్యాదు చేయాలని సూచించగా, రెండు రోజుల తర్వాత వారు తిరిగి పోలీసులను సంప్రదించారు. తనపై చేతులేసి ఆ వ్యక్తి జుగుప్సాకరంగా ప్రవర్తించాడని యువతి చెబుతోంది. అయితే సీసీ పుటేజీని పరిశీలించిన పోలీసులు అది దొంగతనంగా బావిస్తున్నారు. అమ్మాయి డ్రెస్సును చించేశాక సదరు వ్యక్తి ఆమె మెడపై చేయి వేసి గొలుసు దొరకబుచ్చుకునే యత్నం చేయటంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు చిల్లర దొంగలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కూడా.

 

ఇవి కూడా చదవండి... 

 

అర్థరాత్రి కీచక పర్వం

 

అసభ్యంగా తాకుతూ నాలుక కొరికాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  Air Hostess  Molestation  

Other Articles