ఆ యువతి లైంగిక దాడి.. వీడియో... అంతా డ్రామానే! | CCTV camera footage helps police crack KG Halli molestation.

Woman in burqa allegedly molested in bengaluru totally fake

KG Halli molestation, Bangalore molestation, Molestation drama, KG Halli Video footage, molestation case, Irshad Khan molestation, Bangalore shame, Marriage molestation drama, Bangalore molestation drama, Burqa woman molestation, Fake Molestation

The city police have claimed to have cracked the KG Halli molestation case with the arrest of Irshad Khan (34), the brother-in law of the complainant, on Sunday. Irshad had reportedly targeted his sister-in-law on Friday morning in an attempt to scuttle her marriage proposal as the police claimed they were in a relationship for the last four years.

సంచలన వీడియో వెనుక షాకింగ్ వాస్తవం

Posted: 01/09/2017 11:02 AM IST
Woman in burqa allegedly molested in bengaluru totally fake

మూడు రోజుల క్రితం బెంగళూర్ లో మరో లైంగిక వేధింపు వీడియో వెలుగు చూడటం తెలిసిందే. బురఖాలో వెళ్తున్న ఓ యువతిని ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించటమేకాదు, పెదాలను, నాలుకను కొరికి తీవ్రంగా గాయపరిచి పారిపోయిన వీడియో కలకలం రేపింది. అయితే ఈ ఘటన వెనుక ఉన్న అసలు విషయం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.

ప్రేమించిన ఆ యువతిని పెళ్లి చేసుకోవాలన్న ఫ్లాన్ తోనే సదరు వ్యక్తి అలా చేశాడంట. ఇందులో ఆ యువతి కూడా సహకరించినట్లు విచారణలో వెలుగు చూసింది. కర్ణాటక రాష్ట్రంలోని గోవింపురానికి చెందిన ఇర్షాద్ ఖాన్ కు ఓ ప్రైవేట్ కంపెనీలో సెల్స్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని మరదలు కూడా వాళ్ల ఇంట్లోనే ఉంటుంది. అక్క మొగుడు అని కూడా చూడకుండా ఇద్దరు ప్రేమలో పీకల లోతులో మునిగిపోయారు. అయితే పెళ్లికి పెద్దలు అడ్డుచెబుతారని భావించి చివరకు లైంగిక దాడి డ్రామా ఆడారు. వెంటనే ఆ కన్నింగ్ ఐడియాను అమలుపరిచారు. పెదాలు, నాలుక గట్టిగా కొరికాడు

ఈ నెల ఐదవ తేదిన ఉదయం ఆరుగంటలకు ఈ పథకాన్ని అమలుచేశారు. ముసుగు ధరించిన ఓ యువకుడు ఆ యువతి వెంట పడ్డాడు. ఈ దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యేలా జాగ్రత్త తీసుకొన్నాడు. ఆ తర్వాత ఆ యువతి తన చేయి, నాలిక కరుచుకొని గాయం చేసుకొంది. తనపై లైంగిక దాడి జరిగిందని ఆమె కేజీ హళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు కేసు చేదించేందుకు పోలీసులు జాప్యం చేస్తున్నారని ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. నిందితుడిని అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకొన్నారు.

అలా దొరికిపోయాడు...

వీడియో మినహా పోలీసుల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. పైగా ముసుగు ధరించి ఉన్నాడు. అయితే ఫిర్యాదు చేయటానికి యువతి వచ్చిన సమయంలో పక్కనే ఖాన్ కూడా ఉన్నాడు. అదే అతనిని పట్టించింది. సీసీ కెమెరాలో దాడి తర్వాత వ్యక్తి కాస్త కుంటుతూ కనిపించటం పోలీసులు పరిశీలించారు. ఇక ఇర్షాద్ కూడా అలాగే నడుస్తుండటంతో ఖాకీలు పసిగట్టేశాయి.

వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. మరదలిపై లైంగిక దాడి జరిగిందనే ప్రచారం జరిగితే ఆమెను వివాహం చేసుకొనేందుకు ఎవరూ ముందుకు రారని, ఆ సమయంలో తాను ఆమెను వివాహం చేసుకొనేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించినట్లు తెలిపాడు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన డ్రామా అని తేలటంతో పలువురు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Burqa Woman  KG halli  molestation  video  Drama  

Other Articles