పోలీసు అధికారిపై ఎమ్మెల్యే భర్త దౌర్జన్యం.. Raj MLA's husband thrashes police official

Rajasthan s bjp mla s husband thrashes cop senior party leaders intervene to resolve issue

Narendra Meghwal, Rajasthans BJP MLA, MLA husband slaps police, Chandra Kanta Meghwal, MLA husband thrash police, chalan, traffic fine, traffic chalan, assault, bjp, police, Politics, rajasthan

In a shocking development, Rajasthan’s ruling BJP MLA Chandra Kanta Meghwal’s husband Narendra Meghwal allegedly thrashed a police official over issuing a challan for the vehicle of a party worker.

పోలీసు అధికారిపై ఎమ్మెల్యే భర్త దౌర్జన్యం.. చర్యలు శూన్యం..

Posted: 02/21/2017 02:17 PM IST
Rajasthan s bjp mla s husband thrashes cop senior party leaders intervene to resolve issue

చట్టసభ సభ్యురాలి భర్త అయన. చట్టసభలో కూర్చోవడమే కాదు.. ప్రభుత్వాలు తీసుకువచ్చే అనేక చట్టాలను అమోదం తేలిపేవారుకూడా వీరే. కానీ వారి భర్తలు.. ఆ మాటకోస్తే వారే అచరణలో మాత్రం పెట్టడం లేదు. విధుల్లో వున్న పోలీసు అధికారిపై చేయిచేసుకుంటే చట్టం తనపని తాను చేసుకుపోతుందని తెలిసినా.. అలాంటి ఘటనకు పాల్పడిన వారు మాత్రం ఇంకా స్వేచ్చగా తిరుగుతున్నా.. పాలకులు కానీ, కనీసం అక్కడి చట్టం కానీ వారిని అదుపులోకి తీసుకునే చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

చలానా రాశాడన్న కారణంగా పోలీసుపై దుర్భాషలాడుతూ.. దాడికి పాల్పడ్డారు చేశారు. రాజస్థాన్ లోని కోటా జిల్లా మహవీర్ నగర్ పోలీస్ స్టేషనల్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ హౌజ్ అధికారి రామ్ బసైదా కథనం ప్రకారం..  బీజేపీ కార్యకర్త వెళ్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీ చేసి, డాక్యుమెంట్లు లేని కారణంగా చలానా రాశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే చంద్రకాంత మేఘవాల్, భర్త నరేంద్ర మేఘవాల్ తో కలిసి అక్కడికి వెళ్లారు. ఇద్దరు కలిసి డ్యూటీలో ఉన్న పోలీసులపై విరుచుకుపడ్డారు.

మర్యాదగా తమ పార్టీ వ్యక్తిని వదిలిపెట్టాలని, చలానా ఎందుకు రాశారని.. డబ్బు చెల్లించే ప్రసక్తే లేదంటూ గొడవకు దిగి ఎమ్మెల్యే భర్త ఓ పోలీసుపై చేయి చేసుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. డీఎస్పీ కునారమ్ జాత్ సీనియర్ పోలీసులతో జరిగిన వివాదంపై చర్చించనట్లు సమాచారం. ఎంపీ ఓ.ఎమ్.బిర్లా, ఇతర బీజేపీ నేతలు గొడవ సద్దుమణిగేలా చేయాలని, కేసు లాంటివి లేకుండా రాజీ కుదర్చాలని యత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారు. డ్యూటీలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతల ఒత్తిడితో ఎమ్మెల్యే భర్త నరేంద్ర మేఘవాల్ ను అరెస్ట్ చేయలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MLA Chandra Kanta Meghwal  Narendra Meghwal  assault  bjp  police  Politics  rajasthan  

Other Articles