రాయ్ బరేలీలో రాహుల్.. అశీర్వదించిన తల్లులు.. తప్పిన ముఫ్పు Stage falls before Rahul-Akhilesh speech in Allahabad, none hurt

Stage falls before rahul akhilesh speech in allahabad none hurt

Rahul Gandhi, UP elections, UP elections 2017, Uttar Pradesh, Elctions-2017, Rahul Gandhi, Raebareli rally, all women supporters rally, rahul akhilesh stage falls, rahul gandhi akhilesh yadav stage falls, stage falls for rahul gandhi and akhilesh yadav. rahul akhilesh stage falls, congress india news, politics

Rahul Gandhi invoked two Bollywood blockbusters to take a dig at Modi saying he promised “achhe din” like Shah Rukh Khan in “Dilwale Dulhaniya Le Jayenge” but ended up Gabbar Singh of “Sholay”.

ITEMVIDEOS: రాయ్ బరేలీలో రాహుల్.. అశీర్వదించిన తల్లులు.. తప్పిన ముఫ్పు

Posted: 02/21/2017 04:32 PM IST
Stage falls before rahul akhilesh speech in allahabad none hurt

ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షణం తీరిక లేకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన తల్లి సోనియాగాంధీ అేకుండా దాదాపుగా ఇరువై ఎనమిదేళ్ల తరువాత ఆయన తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బెరేలి లోక్ సభ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాయ్‌బరేలీలోని ఛాటో గ్రామంలో ఓ ఎన్నికల సభకు ఆయన హాజరై ప్రసంగించారు. అయితే తన తల్లి లేకపోయినా ఆయన రాయ్ బరేలీలోని తల్లుల అశీర్వాదం మాత్రం మెండుగా లభించింది.

అదెలా అంటారా..? ఏ ఎన్నికల సభను తీసుకున్నా అక్కడ అధికంగా పురుషులు మాత్రమే కనిపిస్తారు. కానీ రాహుల్ సభకు మాత్రం అధిక సంఖ్యలో మహిళలే తరలివచ్చారు. ఇంత మంది మహిళలు సభకు హాజరు కావడంతో రాహుల్ లో ఉత్సాహం ఉప్పొంగింది. దీంతో ఇది పూర్తిగా మహిళా మద్దతుదారుల సభగా కనిపించింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలోగానీ, బహిరంగ సభలలో గానీ ఇలా ఎక్కువగా మహిళలే కనిపించడం చాలా అరుదు. దీంతో ఈ విషయాన్ని రాహుల్‌ సైతం తన ప్రసంగంలో ప్రస్తావించారు.

'తొలిసారి ఒక ఎన్నికల ర్యాలీకి మహిళలు అత్యధికంగా తరలిరావడం చూస్తున్నాను. మీరు అత్యధికంగా వచ్చి పురుషులను పక్కకు తప్పుకొనేలా చేశారు' అని ఆయన పేర్కొన్నారు. సభకు వచ్చిన వారి కెరింతల మధ్య.. ప్రధాని మోదీ చెప్పినట్టు మీ బ్యాంకు ఖాతాలోకి రూ. 15 లక్షల చొప్పున వచ్చాయా? అని ప్రశ్నించారు. కేవలం సంపన్నుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. తన తల్లి నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాహుల్‌గాంధీ ప్రయత్నించారు.

మరోవైపు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లిద్దరూ కలసి హాజరుకావాల్సిన అహ్మదాబాద్ బహిరంగసభలో అపశృతి చోటుచేసుకుంది. సభా వేదిక ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమిని గెలిపిస్తే మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వారి కుటుంబభద్రత కోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే పలువురు కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. అయితే ఆ సమయంలో రాహుల్, అఖిలేష్ యాదవ్ లిద్దరూ వేదక వద్దకు ఇంకా చేరుకోకపోవడంతో పెనుముప్పు తప్పినట్లైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttar pradesh  samajwadi party  akhilesh yadav  rahul gandhi  bjp  allahabad  uttar pradesh  

Other Articles