పాకిస్థాన్ లో జంటపేలుళ్లు.. ఆరుగురు మృతి Twin blasts near Charsadda court, six dead, 14 injured

6 martyred 20 injured in charsadda terrorist attack

charsadda, charsadda blast, charsadda twin blast, pakistan, pakistan twin blasts, news, latest news, breaking news, pakistan breaking news, latest pakistan news

At least six people have been been killed and 14 have been injured in the attack after blasts occurred outside a court in Charsadda in the Khyber-Pakhtunkhwa province of Pakistan.

ITEMVIDEOS: పాకిస్థాన్ కోర్టులో జంటపేలుళ్లు.. ఆరుగురు మృతి,

Posted: 02/21/2017 01:41 PM IST
6 martyred 20 injured in charsadda terrorist attack

పాకిస్థాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం ఒక రోజు దానిని మింగేస్తుందని అఫ్ఠనిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసిన సరిగ్గా వారం కూడా తిరగకుండానే వరుస బాంబు పేలుళ్లతో పాకిస్థాన్‌ మరోసారి దద్దరిల్లింది. ముగ్గురు ఆత్మహుతి సభ్యులు ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. పాక్‌ వాయవ్య ప్రాంతంలోని చార్సద్దా జిల్లా తాంగి ప్రాంతంలో ఉన్న ఓ కోర్టు ఆవరణలో వరుస మూడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

ఈ దాడిలో ముగ్గురు ఆత్మహుతి సభ్యులతో పాటు నలుగురు అ దేశ పౌరులు మృతి చెందగా, పెద్దసంఖ్యలో పలువురు గాయపడ్డారు. హుటాహుటిన రంగంలోకి దిగిన రక్షణ బలగాలు క్షతగాత్రులను అస్పత్రులకు తరలించిన చికి్త్సను అందిస్తున్నాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు కోర్టులో దాడికి ప్రయత్నించగా.. అందులో ఇద్దరిని పోలీసులు మట్టుబెట్టారు. మరొక సూసైడ్‌ బాంబర్‌ తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో న్యాయవాదులు ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

ఇరుగుపొరుగుకు ఉగ్రవాదం ఎగుమతి చేస్తున్న దేశంగా తరచు విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ గత వారమంతా వరస పేలుళ్లతో హోరెత్తిన సంగతి తెలిసిందే. లాహోర్‌ మొదలుకొని బలూచిస్తాన్‌లోని ఆవారన్‌ వరకూ పలు నగరాలు, పట్టణాల్లో దాదాపు పది ఉగ్రవాద దాడులు జరిగి దాదాపు 50మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ పరాకాష్ట అనదగ్గ ఘటన గత గురువారం సింద్‌ రాష్ట్రంలోని సెహ్వాన్‌లో సూఫీ మత గురువు లాల్‌ షాబాజ్‌ ఖలందర్‌ ప్రార్థనా మందిరంలో చోటు చేసుకుంది. ఇక్కడ మానవ బాంబు జొరబడి చేసిన ఈ దాడిలో 80 మంది మరణించారు. మరో 250మంది తీవ్రంగా గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles