‘సీఎం పీఠంపై అనుమానాలోద్దు..’ తేల్చిచెప్పిన ములాయాం సింగ్ Akhilesh Yadav will become CM again, says Mulayam Singh Yadav

Akhilesh yadav will become cm again says mulayam singh yadav

UP elections 2017,UP assembly elections,samajwadi party,Mulayam Singh Yadav,Akhilesh Yadav

Samajwadi Party chief Mulayam Singh Yadav said there was no rift in the party and his son Akhilesh Yadav will become Uttar Pradesh Chief Minister again.

‘సీఎం పీఠంపై అనుమానాలోద్దు..’ తేల్చిచెప్పిన ములాయాం సింగ్

Posted: 02/19/2017 03:27 PM IST
Akhilesh yadav will become cm again says mulayam singh yadav

ఉత్తరప్రదేశ్‌కు మళ్లీ అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి అవుతారని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని సమాజ్‌ వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాల్లేవని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌ మూడో దశ ఎన్నికల సందర్భంగా సఫాయ్‌ నియోజకవర్గంలో తన కోడలు అపర్ణాయాదవ్‌తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మళ్లీ అఖిలేశ్‌ సీఎం అన్నారు.

తన సోదరుడు శివపాల్‌ యాదవ్‌ కూడా భారీ మెజార్టీతో గెలుస్తాడంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోపక్క అఖిలేశ్‌ కూడా తాజా ఎన్నికలపై స్పందిస్తూ ఈసారి కూడా విజయం తమకే వస్తుందని చెప్పారు. ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి భారీ విజయం సాధించనుందని అన్నారు. బీజేపీ దెబ్బతినడం ఖాయమని తెలిపారు. తన తండ్రి ములాయం ఆశీస్సులు తనకు నిండుగా ఉన్నాయని, మళ్లీ అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles