దొంగ, పోలీస్ జోడీకి నిజమైన వాలెంటైన్స్ డే.. real valentine day of bihar cop, who falls in love with kidnapper

Real valentine day of bihar cop who falls in love with kidnapper

constable Mohammad Inamul, prisoner Sariful Khatun, love marriage, katihar jail, kidnapping accused, Valentine Day, wedding, bihar

In a bizarre incident that took place in katihar district of Bihar, A policeman fell in love with a kidnapping case convict and married her on the Valentine’s Day

దొంగ, పోలీస్ జోడీకి నిజమైన వాలెంటైన్స్ డే..

Posted: 02/19/2017 01:31 PM IST
Real valentine day of bihar cop who falls in love with kidnapper

వాలెంటైన్స్ డే.. కొందరు ఈ రోజును విషాదంగా భావిస్తే.. చాలమంది మాత్రం ప్రేమికుల రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏఢాది వచ్చిన వాలెంటైన్స్ డే ఎందరి బ్యాచిలర్ జీవితాలకు ఫుల్ స్టాప్ పెట్టిందో తెలియదు కానీ, 52 ఏళ్ల పోలీసుకు మాత్రం ఇది నిజమైన వాలెంటైన్ గా మారింది. ఓ కేసులో నిందితురాలు ఆమె. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో పోలీస్ కానిస్టేబుల్ మనసు దోచుకుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న కానిస్టేబుల్ ప్రపోజల్ కు ఆమె ఒకే చెప్పింది. ఫిబ్రవరి 14న వివాహంతో వీరి కథ సుఖాంతం అయింది. అయితే ఇక్కడ అసలు ట్విస్టు ఏంటంటే.. మన పోలీసుకు ఇదివరకు పెళ్లైంది. అయినా మరో పాతికేళ్ల పడచును మనువాడాడు.

మహమ్మద్ ఇనాముల్(52) ఓ కానిస్టేబుల్. ఏడాదిన్నర నుంచి బిహార్ లోని కతిహర్ జైలులో విధులు నిర్వహిస్తున్నాడు. సరిఫుల్ ఖతున్(25) అనే యువతిని చోరీ, కిడ్నాప్ కేసులో గతేడాది కతిహర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 8 నెలలపాటు ఆమె జైలుశిక్ష అనుభవించింది. గతంలోనే వివాహితుడు అయిన కానిస్టేబుల్ ఇనాముల్, సరిఫుల్ పై మనసు పడ్డాడు. ఆమె కూడా ఇనాముల్ ను ప్రేమించింది. తమ ప్రేమను ఎవరూ వ్యక్తం చేయలేదు. చివరగా జైలుశిక్ష పూర్తిచేసుకుని ఆమె విడుదలైంది. ఈ ఫిబ్రవరి 14న తన మనసులోని మాటను సరిఫుల్ కు గులాబీ ఇచ్చి చెప్పాడు. ఇనాముల్ ప్రపోజల్ కు ఆమె ఒకే చెప్పడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

సరిఫుల్ మాట్లాడుతూ.. ప్రేమకు వయసుకు అడ్డంకి కాదని, ప్రేమికులకు వయసు కేవలం ఒక అంకేలా కనిపిస్తుందని చెప్పింది. ప్రతి మహిళ తనకు ఇలాంటి భర్తే ఉండాలని కోరుకుంటారని సరిఫుల్ అంటోంది. ఫిబ్రవరి 14న మసీదులో సరిఫుల్ తల్లిదండ్రులు, సోదరుడి సమక్షంలోనే ఈ వివాహం జరిగిందని సమాచారం. రెండో పెళ్లికి తన మొదటి భార్య ఎలాంటి అడ్డు చెప్పలేదని, ఆమె ఇష్టపూర్వకంగానే ఈ వివాహం జరిగిందని కానిస్టేబుల్ ఇనాముల్ వివరించారు. ఖైదీని పోలీసు వివాహం చేసుకోవడాన్ని జైలు చీఫ్ సుజిత్ కుమార్ వ్యతిరేకించారు. అదే సమయంలో ఇది కానిస్టేబుల్ వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు. అయితే కొందరు మాత్రం ముసలోడికి దసరా పండగ అంటూ చమత్కరిస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles