అవసరానికి దొరకడం లేదు.. కానీ అక్కడ నోట్ల వర్షమా..! Gujarat Folk Singer Showered With Wads Of Cash

Gujarat folk singer showered with wads of cash triggers row

Folk Singer, Kirtidan Gadhvi, music event, Gujarat, denomitisation, Farida Mir, Prime Minister, Narendra Modi, Swaminarayn Complex, Surat

Famous folk singer from Gujarat Kirtidan Gadhvi perhaps had not foreseen that he would land in the middle of a big controversy while performing at a cultural programme in the Vapi town of South Gujarat

అవసరానికి దొరకడం లేదు.. కానీ అక్కడ నోట్ల వర్షమా..!

Posted: 02/19/2017 09:44 AM IST
Gujarat folk singer showered with wads of cash triggers row

గుజరాతీ సింగర్ కు కురిసిన కాసుల వర్షం నేపథ్యంలో అనేక ప్రవ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుజారాతీ సంప్రదాయంతో ఓ సంగీత విభావరని నిర్వహించిన ఆయనపై కురిసిన కాసులే అందుకు కారణమయ్యాయి. వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణంలో ఓ సాంస్కృతిక కార్యక్రమానికి ఫోక్ సింగర్ కీర్తిధన్ గధ్వి హాజరయ్యాడు. స్వామి నారాయణ్ కాంప్లెక్స్ లో తన పాటలతో అక్కడి వారిలో ఉత్సాహాన్ని నింపాడు. అయితే ఆయన పాడటం మొదలుపెట్టింది తరవాయి.. వారిపై నోట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. దీంతో ఆయనకు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. తొలిసారిగా 2015లో జామ్ నగర్‌లో ఓ ఈవెంట్లో రూ. 4 కోట్ల నగదు రాబట్టి వెలుగులోకి వచ్చాడు కీర్తిధన్.

సింగర్ కీర్తిధన్ గధ్వి, ఆయన బృంధంపై ఈవెంట్ ముగిసేవరకూ రూ.100, రూ.500 నోట్లు, కొందరైతే రూ.50, రూ.10 నోట్లను చల్లుతూనే ఉన్నారు. డబ్బులు ఇలా చల్లడం ఏంటి, అవి ఎవరిస్తున్నారు, వారికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. అసలు ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారన్న ప్రశ్నలు ఆయనను చుట్టుముట్టాయి. లక్షల్లో రూపాయలు ఆయనపై కురిపించగా.. నగదు ఎంతో లెక్క మాత్రం తెలపలేదు. ఓవైపు ఏంతో మంది చేతికి డబ్బులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఇలా నోట్లను చల్లుతున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సింగర్ కీర్తిధన్ నోట్ల వర్షంపై స్పందిస్తూ.. 'ఇలా చేయడమన్నది గుజరాతీ సంప్రదాయంలో ఓ భాగం. ఈ నగదును సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తాను. డబ్బు దొరికింది కదా అని వృథా చేసే ప్రసక్తే లేదు. మంచి కార్యక్రమాలకు ఖర్చు చేస్తాం' అని చెప్పాడు. గతేడాది దక్షిణ గుజరాత్ లో ఓ సింగర్ నవరాత్రి ఉత్సవాలలో కచేరీ పెట్టగా.. దాదాపు రూ.40 లక్షల నగదును ఆయనపై కురిపించడం అప్పట్లో వివాదాస్పదమైంది. నోట్ల రద్దు తర్వాత కొత్త రూ.500, రూ.2000 నోట్లను విచ్చలవిడిగా చల్లుతూ ఈవెంట్ నిర్వహించడంపై తీవ్ర విమర్శలు తలెత్తాయి.

తాజాగా సింగర్ కీర్తిధన్ ఈవెంట్లోనూ ఇలాగే నోట్లవర్షం కురిపించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.  ఇక పాత నోట్ల రద్దు తరువాత కొత్తగా అర్థిక మంత్రి అరున్ జైట్లీ తీసుకువచ్చిన చట్టం ప్రకారం ఎవరి వద్ద కూడా మూడు లక్షల రూపాయలకు మించి నగదు వున్నా అది చట్ట విరుద్దమని, వారిని అరెస్టు కూడా చేస్తామని ప్రకటించారు. అయితే సింగర్ పై మాత్రం గుజరాత్ వాసులు పెద్ద మొత్తంలో డబ్బుల రాసుల కురిపిస్తున్నా.. వారిపై ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles