పన్నీర్ వర్సెస్ పళనీ... కాంపోజిట్ పరిష్కారమా? | composite floor test is only Solution for Tamil Nadu.

Sasikala convicted focus now shifts to governor vidyasagar rao

Tamil Nadu Governor C Vidyasagar Rao, C Vidyasagar Rao, Tamil Nadu VK Sasikala, Tamil Nadu Politics, Tamil Nadu Raj Bhavan, Panneerselvam Palaniswamy, Palaniswamy, AIADMK Members, Palaniswamy Support, Palaniswamy Vidyasagar Rao

Tamil Nadu Governor C Vidyasagar Rao is likely to order a composite floor test in the 234-member state Assembly after Supreme Court upheld trial court's verdict in the DA case against VK Sasikala.

చిన్నమ్మ తీర్పుతో ఫోకస్ షిఫ్ట్ అయ్యింది

Posted: 02/15/2017 08:57 AM IST
Sasikala convicted focus now shifts to governor vidyasagar rao

సుప్రీం తీర్పుతో శశికళ శకం ముగిసిపోయినట్టే. నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రి పీఠం కోసం శశికళతో పోటీపడిన పన్నీర్ సెల్వానికి నేడు పళని స్వామికి సవాల్ విసురుతున్నాడు. సుప్రీం తీర్పుతో కంగుతిన్న శశికళ వర్గం పళనిస్వామిని మంగళవారం శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఎన్నికైన వెంటనే పళనిస్వామి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు ఫ్యాక్స్ చేశారు. సాయంత్రం గవర్నర్‌ను కలిసి లేఖ అందించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, తనను ఆహ్వానించాలని కోరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పన్నీర్‌కు మద్దతు తెలుపుతున్న ఎంపీ మైత్రేయన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ‘అమ్మ’కు విధేయులైన ఈ ఇద్దరూ ఇప్పుడు బలనిరూపణకు సై అంటే సై అంటున్నారు. బలనిరూపణకు సిద్ధమంటున్న రెండు వర్గాల్లో ఏ ఒక్కరిని తొలుత ఆహ్వానించినా విమర్శలు కొని తెచ్చుకోవడమే అవుతుందని గవర్నర్ యోచిస్తున్నారు.

అయితే మధ్యేమార్గంగా అటార్నీ జనరల్ సూచించినట్టు ‘కాంపోజిట్’ బలపరీక్ష నిర్వహించాలని విద్యాసాగర్‌రావు నిర్ణయించినట్టు తెలుస్తోంది. తద్వారా మెజారీటీ ఉన్నవారే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తారని, ఎదురవబోయే విమర్శల నుంచి కూడా తప్పించుకోవచ్చని గవర్నర్ భావిస్తున్నట్టు రాజ్‌భవన్ వర్గాల భోగట్టా.    రాజ్ భవన్ రహాస్యం

వేద నిలయం ఇక...

సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ భవితవ్యం ఏమిటో తేలిపోయింది. జయలలిత మరణానంతరం పోయెస్‌గార్డెన్‌లోని ఆమె నివాసం ‘వేద నిలయం’లో శశికళ, ఆమె సోదరుడి భార్య ఇళవరసి కాలుమోపారు. అక్కడి నుంచే శశికళ చక్రం తిప్పారు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో వారు జైలుకు వెళ్లనున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ప్రస్తుతం ‘వేద నిలయం’ కళ తప్పింది. ఇప్పుడది ఖాళీ కానుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వేద నిలయాన్ని స్మారక మందిరం చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే డిమాండ్‌తో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వారం రోజులుగా సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా చేపట్టాడు.

అన్నాడీఎంకే వర్గాలతోపాటు ప్రజల నుంచి కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ‘అమ్మ’ నివసించిన వేదనిలయం తమకు మందిరంతో సమానమని, అందులో ఇతరులు నివసించేందుకు అంగీకరించేది లేదని పార్టీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సుప్రీం తీర్పు మరోలా వచ్చి ఉంటే ఎలా ఉండేదో కానీ ఆమెకు వ్యతిరేకంగా రావడంతో వేద నిలయాన్ని స్మారకం మందిరంగా చేయడం ఇప్పుడు మరింత సులభమైందని చెబుతున్నారు.        ఆనాడు ఇలాగే జరిగి ఉంటేనా?...

సుప్రీంకు శశి లాయర్లు..

వెంటనే లొంగిపోవాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ, ఆ ఆదేశాలు అందలేదంటూ శశికళ రాత్రంతా పోయెస్ గార్డెన్స్ లోనే ఉన్న విషయం తెలిసిందే. బయట గుమిగూడిన అభిమానులను ఓదార్చే ప్రయత్నం చేసిన చిన్నమ్మ శశికళ.. ఆ తర్వాత లోపలకు వెళ్లిపోయారు. పోలీసులు కూడా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే, పోలీసులు ఆమెను అరెస్టుచేసి బెంగళూరు తీసుకెళ్తారా లేద అన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు.

ఈ నేపథ్యంలో శశికళే స్వయంగా బెంగళూరు వెళ్లి అక్కడ లొంగిపోవచ్చని విశ్వసనీయ సమాచారం. మరోవైపు బుధవారం ఆమె తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఇప్పటికే ఆరు నెలల జైలుశిక్ష అనుభవించిన శశికళ.. మరో మూడున్నరేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. అప్పట్లో జయలలితతో పాటు ఉన్న పరప్పణ అగ్రహా జైల్లోనే ఇప్పుడు కూడా శశికళ ఉండాల్సి ఉంటుంది. ఆమెతో పాటు ఇళవరసి, సుధాకరన్ సైతం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దాంతోపాటు సుప్రీం కోర్టు విధించిన జరిమానాను కూడా వాళ్లు ముగ్గురూ చెల్లించాల్సి ఉంటుంది. ఇక శశికళ కోసం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు ముస్తాబవుతోంది. గతంలో ఇదే కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇదే జైలులో కొన్ని రోజులు ఉన్నారు. అప్పుడామెకు కేటాయించిన బ్యారక్‌లోనే ఇప్పుడు శశికళను కూడా ఉంచే అవకాశం ఉంది.

ఈమేరకు సన్నాహాలు పూర్తి చేసిన జైలు అధికారులు ‘చిన్నమ్మ’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. సిటీ సెంట్రల్ జైలు వద్ద ముందు జాగ్రత్త చర్యగా వందమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  కాగా శశికళ ఈ రోజు లొంగిపోతే సాయంత్రంలోగా జైలుకు తరలించే అవకాశం ఉంది. అయితే కేసుపై అప్పీలు దాఖలు చేసుకునే అవకాశం ఉండడంతో మరో రెండు రోజులు ఎదురు చూడాలని శశికళ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

 

సంబంధిత కథనాలు... 

 

చిన్నమ్మకు కన్నీరే...

 

సుప్రీం తీర్పుపై శశికళ రియాక్షన్

 

శశి వారసుడు గట్టోడే...

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Palaniswamy  Panneerselvam  Tamil Nadu  CH Vidyasagar Rao  

Other Articles