చరిత్రలో ఆ నలుగురు ఏం మిస్సయ్యారంటే... | Sasikala and Panneerselvam miss from UPA lesson.

Paneerselvam revolt remind upa regime

Panneerselvam Revolt, Sasikala Sonia Gandhi, Panneerselvam, Panneerselvam Manmohan Singh, Panneerselvam UPA Lesson, Panneerselvam Congress, Panneerselvam BJP, Panneerselvam Sonia Gandhi, Panneerselvam Sasikala Natarajan

The Revolt by O Paneerselvam the other day came as a surprise to everyone. But then the revolt may lead itself to history book as missed opportunity to two political leaders. Sasikala will be seen as a greedy woman who could not resist the temptation for power. She could have easily enjoyed the power without any responsibility just like how Sonia Gandhi did during Manmohan Singh regime. And the other example is also from the same regime. Manmohan Singh who was regarded as country’s best economist got the name of a puppet PM due to his loyalty to Congress.

శశికళ వర్సెస్ సెల్వం.. ఓ పాత చరిత్ర!

Posted: 02/08/2017 06:08 PM IST
Paneerselvam revolt remind upa regime

వీరవిధేయుడిగా ఉన్న పన్నీర్ సెల్వం ఒక్కసారిగా తిరుగుబాటు చేయటం తమిళనాడు రాజకీయాలే కాదు, యావత్ దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సమయంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నప్పటికీ, అధికార దాహంతో ఉవ్విళ్లూరుతున్న చిన్నమ్మ అంటూ సానుభూతితో సెల్వంకే జనాల మద్ధతు(సోషల్ మీడియాలో కూడా) ఎక్కువగా లభిస్తోంది. ఏది ఏమైనా తమిళనాడులో ప్రకంపనలు రేపిన ఈరోజు మాత్రం రాజకీయ చరిత్రలో నిలిచిపోయిందనే అనుకోవాలి.

అయితే ఈ పరిస్థితులను యూపీఏ హయాంలో జరిగిన పరిస్థితులకు అన్వయిస్తున్నారు కొందరు విశ్లేషకులు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన అధినేత్రి సోనియా గాంధీ 2004 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పటికీ విమర్శలు రావటంతో వదులుకుంది. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ లాంటి కీలు బొమ్మ కి అప్పగించి పెత్తానం చెలాయించిందన్నది అందరికీ తెలిసిందే.

ఇక తన నుంచి బలవంతంగా అధికారం లాక్కుందని ఆరోపణలు చేసిన సెల్వం గనుక కిక్కురు మనకుండా ఉండి ఉంటే భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలు అతలాకుతలం అయి ఉండేదన్నది వారి వాదన. అమ్మ పార్టీకి చెడ్డ పేరు రాకూడదనో లేక మరేయితర కారణం మూలంగానో తెలీదుగానీ సెల్వం మొనగాడిలా తిరుగుబాటు చేయటం ఒక రకంగా మంచిపనేనని వారంటున్నారు. గొప్ప ఆర్థిక వేత్త అయిన మన్మోహన్ కూడా ఆనాడు ఇలాంటి పనే చేసి ఉంటే అవినీతి ప్రభుత్వానికి ప్రధానిగా పని చేశాడన్న అపఖ్యాతి మూటగట్టుకుని ఉండేవాడు కాదన్నది వారి అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panneerselvam  Sasikala  Revolt  UPA  Sonia Gandhi  Manmohan Singh  

Other Articles