శశికళ ముఖ్యమంత్రి పీఠానికి అక్రమాస్తుల కేసే అడ్డుగోడా..? disproportionate assets case a barriet to Sasikala to achive CM post

Disproportionate assets case a barriet to sasikala to achive cm post

tamil nadu, paneer selvam, sasikala, chief minister, vidyasagar rao, cabinet minister, deepa jayakumar, Golden Bay Resort, Koovathur Village residents, tamil nadu politics

The much-awaited verdict in the disproportionate assets case, in which V K Sasikala is accused+ , is unlikely to be pronounced by the Supreme Court on Monday,

శశికళ ముఖ్యమంత్రి పీఠానికి అక్రమాస్తుల కేసే అడ్డుగోడా..?

Posted: 02/12/2017 08:24 AM IST
Disproportionate assets case a barriet to sasikala to achive cm post

తమిళనాట రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్న చిన్నమ్మ శశికళ కలలపై ఇప్పటికే నీళ్లు పడ్డాయి. కాగా ఈ తరుణంలో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిని అక్రమాస్తుల కేసు వెంటాడుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత జయలలితతో పాటు శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి త్వరగా బయటపడితే.. సీఎం పదవి చేపట్టేందుకు తనకు లైన్‌ క్లియర్‌ అవుతుందని శశికళ భావిస్తున్నారు. కానీ ఇప్పట్లో ఆ అవకాశాలు లేవని తాజా పరిణామాలు చాటుతున్నాయి.

ఈ కేసు నుంచి జయలలిత పేరును తొలగించాలని తాజాగా కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయపరమైన అంశం కావడంతో కర్ణాటక పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించే అవకాశముంది. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆలస్యమయ్యే అవకాశముంది. దీంతో సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం లేదని తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు శశికళను, ఆమె కుటుంబసభ్యులను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.

ఈ తీర్పును జయలలిత సవాల్‌ చేయడంతో కర్ణాటక హైకోర్టు ఈ తీర్పును కొట్టేసింది. హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ క్రమంలో జయలలిత మరణించడం, ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే అధినేత్రిగా ఎన్నికకావడమే కాకుండా.. సీఎం పదవి కోసం సిద్ధమవుతుండటంతో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వారంలోనే ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని గతంలో సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చింది. అయితే, ఈ కేసులో తీర్పును న్యాయస్థానం వచ్చేవారం ఇవ్వవచ్చని న్యాయవిశ్లేషకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles