ఖగోల చరిత్రను తిరగరాయనున్న ఇస్రో.. 15న ముహూర్తం ISRO bid to create histiory.. set to launch PSLV C37

Isro bid to create histiory set to launch pslv c37

ISRO, Mars, Venus, Space, India, NASA, isro creates history, isro history, pslv c 37, Arun Jaitley, Narendra Modi, Sriharikota, Space Travel, news, nation, nation news

The Indian Space Research Organisation’s (ISRO) bid to script space history by sending 104 satellites into orbit using a single launcher on February 15

ఖగోళ చరిత్రను తిరగరాయనున్న ఇస్రో.. 15న ముహూర్తం

Posted: 02/12/2017 09:05 AM IST
Isro bid to create histiory set to launch pslv c37

ఇప్పటికే ఘనమైన చరిత్రతో ముందుకు దూసుకెళ్తున్న ఇస్రో మరో ఘనకీర్తిని అందుకునేందుకు సర్వం సిద్దం చేసింది. పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా 1,478 కిలోల బరువైన 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశా రు. కార్టోశాట్‌ ఉపగ్రహం 714 కిలోల బరువు కాగా, మిగిలిన 103 ఉపగ్రహాల బరువు 664 కిలోలు మాత్రమే. ఇందులో 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌–2డీ ఉపగ్రహం, 8.4 కేజీల బరువున్న ఇస్రో నానోశాటిలైట్‌ (ఐఎన్‌ఎస్‌–1ఏ), 9.7 కిలోల బరువు కలిగిన ఇస్రో నానోశాటిలైట్‌ (ఐఎన్‌ఎస్‌–1బీ) అనే మూడు స్వదేశీ ఉపగ్రహాలను ప్రధానంగా పంపనున్నారు. అమెరికాకు చెందిన 631.8 కిలోల 88 డౌవ్‌ శాటిలైట్స్, 8 లీమూర్‌ శాటిలైట్స్‌తో కలిపి 96 చిన్న తరహా ఉపగ్రహాలను పంపనున్నారు.

నెదర్లాండ్‌కు చెందిన మూడు కేజీల పీయాస్‌–1, స్విట్జర్లాండ్‌కు చెందిన 4.2 కేజీల డిడో–2, ఇజ్రాయెల్‌కు చెందిన 4.3 కేజీల బీజీయూశాట్, కజకిస్థాన్‌కు చెందిన 1.7 కేజీల ఆల్‌–ఫరాబీ–1, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన 1.1 కేజీల నాయిప్‌–1 అనే విదేశీ ఉపగ్రహాలను పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 22 దేశాలకు చెందిన 76 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ రాకెట్ల ద్వారానే పంపించి మన సత్తా ప్రపంచానికి చాటారు.  ప్రస్తుతం 101 ఉపగ్రహాల ప్రయోగం పూర్తయితే మొత్తం 177 ఉపగ్రహాలు వాణిజ్యపరంగా పూర్తి చేసినట్లవుతుంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించనుండడంతో దేశంలోని మేధావులే కాకుండా ప్రపంచం అంతా కూడా ఇస్రో వైపే చూస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  Mars  Venus  Space  India  NASA  isro creates history  pslv c 37  Sriharikota  

Other Articles