అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పెద్ద షాకే ఇచ్చింది. మరో పది రోజుల్లో ఆయన ఇల్లు, ‘సాక్షి’ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. ఆస్తుల స్వాధీనానికి సహకరించాలంటూ గురువారం ఈడీ నోటీసులు జారీ చేయటంతో జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. జగన్ నివాసంతోపాటు, సాక్షి కార్యాలయానికి వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారు. అనంతరం జగన్మోహన్రెడ్డికి చెందిన ఏయే ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్నదీ ప్రకటన కూడా విడుదల చేశారు.
వాస్తవానికి ఆస్తుల స్వాధీనానికి ఈడీ నెలన్నర సమయం ఇస్తుంది. అయితే అత్యంత తీవ్రమైన నేరాల్లో కేవలం పదిరోజులు మాత్రమే గడువు ఇస్తుంది. ఇప్పుడు జగన్ విషయంలో అదే జరిగింది. ప్రస్తుతం ఎలా స్పందించాలన్న దానిపై జగన్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. హైకోర్టును ఆశ్రయించాలన్నా సోమవారం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. అప్పటికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని భయపడుతోంది. ఈనెల 20 లోపు ఈడీ నోటీసులపై స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు కోర్టు స్టే ఇవ్వకుంటే పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన మొదలైంది. హైకోర్టు కనుక స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించేంత సమయం ఉంటుందా? లేదా? అన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈడీ కనుక ఆస్తులు స్వాధీనం చేసుకుంటే ప్రజల్లో అది జగన్‌కు ప్రతికూల అంశంగా మారుతుందని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా స్టే తెచ్చుకునేందుకే ప్రయత్నిస్తున్నారు.
అటాచ్ చేయబోయే ఆస్తులు...
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తుల స్వాధీనానికి సిద్ధమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. తాము స్వాధీనం చేసుకోబోయే ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఈడీ స్వాధీనం చేసుకోబోయే ఆస్తుల్లో హైదరాబాద్‌లోని సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఈ ఆస్తులన్నీ షలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరుతో ఉన్నాయి.
- బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని నవీనగర్‌లో ఈ కంపెనీ 2623 చదరపు గజాల ప్లాటును కొనుగోలు చేసి అందులో ఎనిమిది అంతస్తుల భవనాన్ని నిర్మించింది. ఇందులోనే సాక్షి దినపత్రిక, టీవీ చానల్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
- సాక్షి బిల్డింగ్ పక్కనే మరో వెయ్యి చదరపు గజాల స్థలంలో సెల్లార్, సబ్ సెల్లార్తోపాటు నాలుగు అంతస్తుల భవనం ఉంది.
- హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఉన్నజగన్ విలాసవంతమైన నివాసం ఉంది.
- కడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిళ్లపల్లిలో ఉన్న హరీశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన 7.85 ఎకరాల భూమి.
- సైబరాబాద్‌లోని రాజేంద్రనగర్ మండలం కాటేదాన్‌లో నివిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన 9680 చదరపు గజాల స్థలం,
- మహేశ్వరం మండలం సర్దార్ నగర్ రెవెన్యూ గ్రామంలో ఉన్న 32.31 ఎకరాల భూమిని ఈడీ స్వాధీనం చేసుకోనుంది.
(And get your daily news straight to your inbox)
Mar 01 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దారుణ హత్యకేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. హత్యకు నిందితులు ఉపయోగించిన రెండు కత్తులు సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికాయి. బ్యారేజ్ 53,... Read more
Mar 01 | అత్యచార కేసుల్లో బాధితులను పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చినా.. లేక మరో విధంగా రాజీ కుదుర్చుకున్నా కేసుల నుంచి మినహాయింపు మాత్రం లభించదని గతంలోనే చెప్పిన దేశసర్వన్నత న్యాయస్థానం ఇవాళ ఓ ప్రభుత్వం ఉద్యోగి... Read more
Mar 01 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రీల్ 6వ తేదీన ఎన్నికల జరగనున్న తమిళనాడులో ఇవాళ బిజీగా పర్యటించారు. ఇటీవల కేరళలోని కోల్లా జిల్లాలో మత్స్యకారులతో కలసి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రాహుల్.. వారితో... Read more
Mar 01 | బంగారు నగల వ్యాపారితో పాటు ఆయన దుకాణానికి కాపలాగా ఉన్న ఓ కుక్కను నెట్ జనులు తిట్టిపోస్తున్నారు. నీ పని నువ్వు చేయకండా.. నీ జాతి కుక్కలకే అవమానాన్ని ఆపాదించిపెట్టావు అంటూ నెటిజనులు మండిపడుతున్నారు.... Read more
Mar 01 | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం (పీఎన్బీ స్కాం)లో ప్రధాన నిందితుడైన నిరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే... Read more