హార్వర్డ్ కన్నా ముందే ఎందుకు పవన్ ప్రసంగం? | Pawan Kalyan NRI Fans Nashua Meet and Greet

Pawan kalyan speech at nashua meet and greet

Pawan Kalyan, Pawan Kalyan NRI Fans, Pawan Kalyan America, Pawan Kalyan Nashua, Nashua Pawan Speech, Nashua Car Rally, Pawan Kalyan New Hampshire, Pawan kalyan Nashua, Nashua Power Star Fans

Actor, Janasena Chief Pawan Kalyan left for Boston 3 days ago for a 5-day tour along with his wife Anna Lezhneva to deliver a speech at Harvard Business School. Before that, Pawan Kalyan is delivering another speech at Nashua High School which is a fan based event which is organized by NRI fans of Pawan Kalyan in and around USA.

ITEMVIDEOS:దెబ్బ తినడమే కాదు.. కొట్టడం కూడా వచ్చు: పవన్ కళ్యాణ్

Posted: 02/11/2017 10:11 AM IST
Pawan kalyan speech at nashua meet and greet

హర్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించే కన్నా ముందే జనసేనాని పవన్ కళ్యాణ్ మరో ఉపన్యాసం ఇచ్చాడు. న్యూ హ్యాంప్ షైర్ లోని నషువా లో ఎన్నారై అభిమానులు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ అక్కడ ప్రసంగించాడు.

నేతల కోసం ఎంతో మంది బలిదానాలు చేస్తుంటే.. వాగ్ధానాలను పక్కనబెట్టి స్వార్థం చూసుకుంటున్నారని తెలిపాడు. ఆ ధోరణి నచ్చకే తాను రాజకీయాల్లోకి రావటానికి, జనసేన స్థాపించేందుకు కారణమైందని తెలిపాడు. కుటుంబాన్ని పక్కకు పెట్టి మరీ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమేకాదు, పోరాడేందుకు తాను ఎప్పుడు ముందుంటానని మరోసారి ప్రకటించాడు. ఇక స్పీచ్ లో సమకాలీన రాజకీయాలపైనే కాకుండా భారత దేశ సంస్కృతి విధానాలపై కూడా పవన్ ప్రసంగించాడు.

జనసేన పార్టీ అంతిమ లక్ష్యం అధికారం కాదని... ప్రజా శ్రేయస్సు అని స్పష్టం చేశాడు. సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును, ఇమేజ్ ను ప్రజాసేవ కోసమే ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. మీట్ అండ్ గ్రీట్ కు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు దెబ్బ తినడం మాత్రమే కాదు, దెబ్బ కొట్టడం కూడా తెలుసని చెప్పాడు. యువ రాజకీయ నేతలు అంటే రాజకీయ వారసులు కాదని... సామాన్య ప్రజల్లో నుంచి కొత్త తరం రావాలని తెలిపారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించకూడదని పిలుపునిచ్చాడు. పవనిజం అన్న అభిమాని పిలుపునకు స్పందిస్తూ హ్యుమనిజం కన్నా గొప్పది ఈ లోకంలో లేదని తెలిపాడు.

సినిమాల్లో తానెప్పుడూ సౌకర్యవంతంగా ఫీల్ కాలేదన్న పవన్, ప్రజల సమస్యలపై పోరాటమే తనకు అంతులేని తృప్తిని ఇచ్చిందని తెలిపాడు. రాజకీయాల పట్ల తనకు పూర్తిగా అవగాహన లేదని... కానీ, సమాజాన్ని చదవడం, ప్రజా సమస్యల పట్ల స్పందించే అలవాటు మాత్రం తనకు ఉందని ఆయన చెప్పాడు. అన్యాయాన్ని చూస్తూ తాను కూర్చోలేనని తెలిపారు. కుల రాజకీయాలు తనకు నచ్చవని, అలాంటి రాజకీయాలు చేసేవారు కూడా తనకు నచ్చరని స్పష్టం చేశాడు.  

పవన్ ప్రసంగంకు ముందు అంతకు ముందు ఎన్నారై ఫ్యాన్స్ తో న్యూ హాంప్ షైర్ లో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక తన అమెరికా పర్యటనలో భాగంగా పవన్ చర్చలు తదితర వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తే 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకోబోతున్నాడన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Speech  Janasena  Nashua Car Rally  

Other Articles