అలిగిన ‘నేత’ను అడ్డుకునేందుకు మైండ్ గేమ్ మొదలుపెట్టారా? | TDP begins mind game Party switching.

Gangula likely to quit tdp begins mind game

Kurnool TDP, Gangula Prabhakara Reddy, Gangula Prabhakara Reddy YSRCP, Jagan Kurnool, Kurnool TDP, TDP Kadapa, YSR Kadapa TDP, TDP Mind Game, YSRCP Mind Game, TDP Party Switching, Gangula Prabhakara Reddy Bhuma Family, Shilpa Brothers, TDP YSRCP

Allagadda constituency in-charge Gangula Prabhakara Reddy set to quit TDP, joins YSRCP. YSRC out to seize the moment as internal conflicts rock Telugu Desam.

టీడీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టిందా?

Posted: 02/10/2017 08:15 AM IST
Gangula likely to quit tdp begins mind game

ఏపీ లో కాస్త గ్యాప్ తీసుకున్న పార్టీ ఫిరాయింపులు మళ్లీ వార్తల్లో నిలిచాయి. అయితే అల్రెడీ జంపింగ్ బాబులు అధికార పార్టీలో ఇమడ లేక తిరిగి సొంత గూటికే చేరుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూల్ కీలక నేత ఒకరు వైసీపీలో చేరుతున్నారన్న వార్త రెండు రోజులుగా హల్ చల్ చేస్తోంది. పార్టీ నియోజక వర్గ ఇన్ ఛార్జీ గంగుల ప్రభాకర్ రెడ్డి త్వరలో పార్టీని వీడుతారని టీడీపీ అనుకూల మీడియానే హైలెట్ చేయటం ఇక్కడ విశేషం. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికార పక్షం మైండ్ గేమ్ మొదలుపెట్టింది.

కడప నుంచి బలమైన నేత ఒకరు టీడీపీలో చేరనున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ పేర్కొనటం విశేషం. రాయలసీమలో టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని, కడపకు పూర్వవైభవం వస్తుందంటూ తెలిపాడు కూడా. అయితే, టీడీపీలోకి వస్తున్న ఆ నేత ఎవరు, ఏ పార్టీ నుంచి అనే వివరాలను ఆయన ప్రస్తావించలేదు. కామెంట్లను నిశితంగా పరిశీలిస్తే కేవలం గంగుల చేరికను అడ్డుకునేందుకే ఇలా వ్యాఖ్యలు చేశాడా? అన్న అనుమానాలు కలగక మానవు.

2014 ఎన్నికలకు ముందు శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, ఆపై సానుభూతి పవనాలతో అఖిల ప్రియ గంగుల పైనే గెలవటం తెలిసిందే. కొంతకాలానికే జగన్ తో ఇమడలేక నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, తన కూతురైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ను తీసుకుని టీడీపీలోకి చేరిపోయారు. ఈ నిర్ణయాన్ని శిల్పాసోదరులతోపాటు, గంగుల కూడా ఓపెన్ గానే వ్యతిరేకించాడు. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు వ్యవహారాన్ని అప్పటికప్పుడు చక్కబెట్టాడు.

ఇక ఇప్పుడు భూమాకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలియగానే శిల్పాబ్రదర్స్ తోపాటు, గంగుల రంగంలోకి దిగారు. మంత్రి పదవి ఇవ్వొద్దంటూ ఇప్పటికే విన్నవించుకున్నారు కూడా. అయితే ఈ విషయంలో వారికి చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఒకే ఒరలో ఇమడటం కష్టమని భావించిన గంగుల పార్టీని వీడేందుకే సిద్ధమైనట్లు సమాచారం. ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. నియోజక వర్గానికి ఎమ్మెల్యే అఖిలప్రియే అయినప్పటికీ, నిధులు మాత్రం టీడీపీ ఇన్‌చార్జ్ గంగుల ప్రభాకర్‌ రెడ్డి పేరుతోనే ఇంతకాలం మంజూరు చేశారు. రాను రాను చంద్రబాబు భూమా కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వటం, గంగుల వర్గాన్ని పట్టించుకోవడం మానేయటంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమౌతోంది.

ఇదిలా ఉండగానే వైఎస్సార్సీపీ అధినేత జగన్ సొంత జిల్లా నుంచి ఒక నేత టీడీపీలోకి వస్తున్నారంటూ గంటా చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. మరోవైపు బలం ఎక్కువగా ఉన్న నేత కావటంతో అంతర్గతంగా గంగులను బుజ్జగించేయత్నాలు చేస్తున్నారని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Kurnool  YSRCP  Gangula Prabhakara Reddy  

Other Articles