తాగి చంపితే నిర్లక్ష్యం ఎలా అవుతుంది? | Drunk drive causing death comes under culpable homicide.

Drunk drive causing death not negligence

Trinamool Congress, Mukul Roy Committee, Drunk Drive Death, Drunk Drive Negligence, Drunk Drive Causing Death, The Motor Vehicles (Amendment) Bill, 2016,

Headed by Trinamool Congress leader Mukul Roy Drunk Parliamentarian Committee suggests to Government that Drivers causing death should be tried for culpable homicide not amounting to murder. An accident caused by drink driving should be treated as a planned crime and not an act of “Negligence”, as is the practice.The Motor Vehicles (Amendment) Bill, 2016 already tabled.

డ్రంక్ అండ్ డ్రైవ్ ‘నిర్లక్ష్యం’ కానే కాదు

Posted: 02/10/2017 08:45 AM IST
Drunk drive causing death not negligence

తప్పతాగి వాహనాలు నడపటం, ఆపై అమాయకపు ప్రాణాలు పోయేందుకు కారకులుగా మారుతున్నారు మందు బాబులు. అలాంటి సందర్భాలలో వారి ప్రమేయం(మద్యం మత్తుతోనే) లేకుండానే ఇలా జరిగిందంటూ న్యాయస్థానాలు తక్కువ శిక్షతో విడిచిపెడుతుండటం చూస్తున్నాం. ఈ వంకతోనే ధైర్యంగా తాగి బండిని రోడ్డు మీదకు ఎక్కించేస్తున్నారు. అయితే ఇకపై అలాంటి వేషాలు కుదరవు. తాగి వాహనాలు నడిపే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది.

తాగి వాహనం నడిపి వ్యక్తుల ప్రాణాలు తీసేవారిపై ఇక నుంచి తీవ్ర హత్యానేరం మోపి శిక్షించాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రస్తుత చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇకపై తాగి వాహనం నడిపి ఇతరుల ప్రాణాలు తీస్తే నిర్లక్ష్యం కిందకు రాదని, దానిని తీవ్రమైన హత్యగానే పరిగణించాలని మోటారు వాహనాల బిల్లుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికలో పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ నేత ముకుల్ రాయ్ నేతృత్వంలోని 32 మంది సభ్యుల బృందం ఈ నివేదికను రూపొందించింది.

ప్రమాదానికి కారణమైన వారిపై 304 సెక్షన్ కింద శిక్షార్హమైన హత్యకు పాల్పడేవారికి యావజ్జీవ జైలు శిక్ష లేదంటే పదేళ్ల కఠిన కారాగారం, లేదంటే జరిమానా విధించాలని కమిటీ సిఫారసు చేసింది. మైనర్ల విషయానికొస్తే వారి పేరెంట్స్ లేదా గార్డియన్లకు 3 ఏళ్ల శిక్ష, పాతిక వేల ఫైన్ విధించటంతోపాటు డ్రైవింగ్ వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేసేలా చట్టం తేబోతుంది.

తాగి నడిపి ప్రమాదానికి పాల్పడితే ముందస్తు పథకంగానే భావించి శిక్ష విధించాలని సూచించింది. నిందితులు వాహనం నడిపినప్పుడు తాగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు అంతర్జాతీయ పరీక్ష పరికరాలు వాడాలని సూచించింది. అలాగే బైక్, కార్ల రేసింగ్‌లపైనా కొరడా ఝళిపించాలని సిఫారుసు చేసింది. రేసింగ్‌లకు పాల్పడే వ్యక్తులపై విధిస్తున్న జరిమానా మొత్తాన్ని పెంచాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

ప్రస్తుతం ఇలా ప్రాణాలు తీసేవారికి ఐపీసీలోని 304 ఏ సెక్షన్ కింద రెండేళ్ల జరిమానా లేదా ఫైన్. లేదా రెండూ విధించటం తెలిసిందే. ఓ అంచనా ప్రకారం ఏడాదికి 1.46 లక్షల ప్రజలు ఏటా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుండటం, అందులో 5 శాతం అంటే సుమారు 7 వేల మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లోనే ప్రాణాలు కోల్పోతుండటంతో ఇలా కఠిన చట్టాలు తేవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drunk and Drive  Cause Death  Culpable Homicide  Mukul Roy Committee  New Act  

Other Articles