హస్తినకు చిన్నమ్మ ఎమ్మెల్యేలు.. ముంబైకి పన్నీరు.. sasikala to visit president to show strength, while Panneerselvam to visit governor

Sasikala to visit president to show strength while panneerselvam to visit governor

sasikala, sasikala natarajan, vk sasikala, sasikala today, tamil nadu, aiadmk, aiadmk crisis, o panneerselvam, tamil nadu chief minister, O Panneerselvam, Jayalalithaa, Sasikala, AIADMK, BJP, india news, tamil nadu news

sasikala natarajan, who got the strength of aiadmk party mla is flying out to delhi to show it to president pranab mukharjee, while paneerselvam to visit mumbai to meet governor

హస్తినకు చిన్నమ్మ ఎమ్మెల్యేలు.. ముంబైకి పన్నీరు..

Posted: 02/08/2017 07:30 PM IST
Sasikala to visit president to show strength while panneerselvam to visit governor

తమిళనాడు అధికారపార్టీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పన్నెండు గంటల వ్యవధిలో రెండు పర్యాయాలు మీడియా ముందుకు వచ్చి చిన్నమ్మ శశికళకు సవాల్ విసిరిన అపధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గురువారం ముంబైకి పయనం కానున్నారు. గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావుతో ఆయన భేటీ కానున్నారు. తాను రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను గవర్నర్ కు వివరించనున్నారు. తనను బలవంతం పెట్టి పదవికి రాజీనామా చేయించారని, ఆ తరువాత తనపై పార్టీ వ్యతిరేకని ముద్రవేసి కోశాధికారి పదవి నుంచి తప్పించారని గవర్నర్ కు వివరించనున్నారు.

అన్నాడీఎంకే పార్టీని అన్నివిధాలుగా పరిరక్షించాల్సిన బాధ్యత తనపై వుందని.. ప్రజలు, పార్టీ, ఎమ్మెల్యేలు కోరుకుంటే రాజీనామా వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని పన్నీరు సెల్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో గవర్నర్ తో ఈ విషయమై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ముంబైకి పయనం కావాలని నిర్ణయించడం కీలకంగా మారింది. గవర్నర్ తో ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన నివాసంలో మద్దతుదారులతో పన్నీరు సెల్వం మంతనాల్లో మునిగిపోయారు. శశికళను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు.

కాగా మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి చెందిన 130 మంది శాసనసభ్యుల బలం తనకు వుందని ప్రకటించిన శశికళతో పాటుగా ఆమెకు మద్దతిస్తున్న 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇవాళ రాత్రి ఢిల్లీకి పయనమై రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీని కలవనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అమె రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ను తీసుకున్నారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు ముంబై నుంచి చెన్నైకి రాకపోవడంతో శశికళ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం వాయిదా పడింది. దీంతో ఆ విషయాన్ని రాష్ట్రపతికే విన్నపించి తనకున్న బలం నిరూపించుకోవాలని శశికళ పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగానే శిశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పరేడ్‌కు హాజరైన ఎమ్మెల్యేలను బస్సుల్లో ఓ హోటల్‌కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : O Panneerselvam  Jayalalithaa  Sasikala  AIADMK  BJP  Tamil Nadu  India news  

Other Articles