చిన్నమ్మ అదేశంతో స్టార్ హోటళ్లకు ఎమ్మెల్యేలు. My responsibility to end wrongdoings of Panneerselvam, says Sasikala

Panneerselvam displays unflinching loyalty to jaya amid sasikala s power play

sasikala, sasikala natarajan, vk sasikala, sasikala today, tamil nadu, aiadmk, aiadmk crisis, o panneerselvam, tamil nadu chief minister, O Panneerselvam, Jayalalithaa, Sasikala, AIADMK, BJP, india news, tamil nadu news

"History has shown us that traitors have never won. We will show the traitors the true path of Amma. It became my responsibility to put an end to the wrongdoings which Panneerselvam had done," says sasikala natarajan

చిన్నమ్మ అదేశంతో స్టార్ హోటళ్లకు ఎమ్మెల్యేలు

Posted: 02/08/2017 04:31 PM IST
Panneerselvam displays unflinching loyalty to jaya amid sasikala s power play

తమిళనాడు అధికారపార్టీలో నాటకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. పన్నెండు గంటల వ్యవధిలో రెండు పర్యాయాలు మీడియా ముందుకు వచ్చి చిన్నమ్మ శశికళకు సవాల్ విసిరిన అపధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. జయ మృతిపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తన ప్రభుత్వంపై వుందని, తాను ముఖ్యమంత్రిగా కోనసాగాలని తమిళనాడు వాసులు కోరుకుంటున్నారని చెప్పచకోచ్చిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఆఫీసులో శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది.

శశికళ అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశానికి 130 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. 48 గంటల్లో పన్నీర్‌ సెల్వం మాటమార్చారని శశికళ ఆరోపించారు. పన్నీర్‌ సెల్వం వెనక కొందరు ఉండి నడిపిస్తున్నారని ఆమె చెప్పారు. తనకు 130 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా తనవైపే ఉన్నారని శశికళ దీమా వ్యక్తం చేశారు. జయలలిత బాటలోనే నడుద్దామని ఆమె పిలుపునిచ్చారు. తాను 33 ఏళ్లుగా అమ్మ జయలలితకు వెంట వున్నానని అన్నారు. సమస్యలను ఎదుర్కోనే సమయస్పూర్తి అమ్మదని అన్నారు. సీఎం సీటు కోసం అమ్మ ఆశయాలను పన్నీరు సెల్వం పనంగా పెట్టారని తీవ్రంగా దుయ్యబట్టారు.
 
పన్నీర్ సెల్వంలో 48 గంటల్లో మార్పు ఎందుకు వచ్చిందో.? ఆయన వెనుక ఎవరున్నారో ప్రజలు గమనించాలని శశికళ సూచించారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా.. కుయుక్తులను పనిన్నా.. పార్టీ ఐక్యతను  కాలరాయలేరని ఆమె తెలిపారు. అన్నాడీఎంకేను ఏ శక్తి విడదీయలేదని శశికళ చెప్పారు. సీఎం కుర్చీపై విపక్షాలు కన్నేశాయని ఆమె ఆరోపించారు. అసెంబ్లీలో డీఎంకే సభ్యులతో పన్నీర్ సెల్వం కలిసిపోయారని ఆమె చెప్పారు. కుట్ర జరిగింది అనడానికి నిన్నటి స్టాలిన్ ప్రసంగమే నిదర్శనమని శశికళ పేర్కొన్నారు. అమ్మ చనిపోయిన వెంటనే బాధ్యతలు చేపట్టాలని పార్టీ సభ్యులు తనను కోరారని, ఇది సరైన సమయం కాదని, వద్దని వారించాననని శశికళ చెప్పారు.
 
అమ్మ ఆత్మ ఎప్పుడూ తన వెంటే ఉంటుందన్నారామె. గతంలో కూడా పన్నీర్ సెల్వంకు అమ్మ అవకాశం ఇచ్చారన్నారు. అదే దారిలో సెల్వానికి తాను ఒక అవకాశం ఇచ్చానని తెలిపింది. ఇప్పుడు డీఎంకేతో చేతులు కలుపుతున్నారన్నాడు. డ్రామాలు టీవీకి పనికొస్తాయి.. పార్టీకి కాదన్నారు. పన్నీరు సెల్వం కుట్రదారు అని, అన్నాడీఎంకే పార్టీకి ద్రోహం చేశారని విమర్శలు గుప్పించారు. అమ్మ వారసురాలని తానేనని.. సీఎం కూడా తానేనంటూ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. సమావేశం అనంతరం శశికళ వర్గం ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయం వద్ద పరేడ్ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా తమిళనాడులోని పలు ఐదు స్టార్ హోలళ్లకు తరలివెళ్లారు.

కాగా మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి చెందిన 130 మంది శాసనసభ్యుల బలం తనకు వుందని రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలియజేశామని, అయితే అయన ఇంకా తమతో ప్రమాణస్వీకారం చేయించడానికి న్యాయ సలహా కోరుతున్న నేపథ్యంలో శశికళ మరో అడుగు ముందుకేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావును కాదని ఏకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్ మెంట్ ను శశికళ తీసుకున్నారని, ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతిని కలవనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శరవేగంగా మారుతున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో తమిళనాడు వాసులు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందన్న విషయమై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : O Panneerselvam  Jayalalithaa  Sasikala  AIADMK  BJP  Tamil Nadu  India news  

Other Articles