శశికళకు బిగ్ షాక్... అర్ధరాత్రి సెల్వం తిరుగుబాటు | Pannerselvam says he was forced to resign.

Outgoing tamil nadu cm o panneerselvam revolts against sasikala

Panneerselvam Revolt, Panneerselvam Dismiss, Tamil Nadu CM O Panneerselvam, Panneerselvam Shock, Panneerselvam Sasikala, Panneerselvam Comments, Panneerselvam MLAs, Panneerselvam Delhi, Panneerselvam Tamil Nadu, Panneerselvam Resign

Outgoing Tamil Nadu CM O Panneerselvam revolts against Sasikala. Sasikala says DMK behind revolt. Dismissed as AIADMK treasurer.

ITEMVIDEOS:అమ్మ సమాధి సాక్షిగా ఓపీఎస్ తిరుగుబాటు

Posted: 02/08/2017 07:53 AM IST
Outgoing tamil nadu cm o panneerselvam revolts against sasikala

పెను సంచలనం, రాజకీయ విశ్లేషకులు సైతం ఊహించని ఘటన మంగళవారం తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంది. వీరవిధేయుడు అయిన పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి ఒక్కసారిగా ‘చిన్నమ్మ’పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలనుకున్న శశికళకు షాకిచ్చారు. ప్రజలు కోరుకుంటే తన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ముందుగా మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి వద్దకు చేరుకున్న ఆయన రాత్రి 9 గంటల వేళ జయలలిత సమాధి వద్ద అంజలి ఘటించిన ఆయన దాదాపు 45 నిమిషాల పాటు అక్కడే ఉండిపోయారు.

అనంతరం కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ‘అమ్మ’ చెప్పిందటూ పలు విషయాలు వెల్లడించారు. శశికళ వర్గం వారు తనతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు. ‘నా అంతరాత్మ వేదనతో రగిలిపోతోంది’.. అని మొదలుపెట్టిన పన్నీర్ సెల్వం దేశ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. తనకు జరగకూడనిది ఏదైనా జరిగితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాలని ‘అమ్మ’ తన చేతులు పట్టుకుని మరీ చెప్పారని తెలిపారు.

అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్‌ను ఎన్నుకోవాలన్నారు. అయితే ఇప్పటికే రెండుసార్లు సీఎంగా ఉండడంతో తాను నిరాకరించానని, ప్రజలు, కార్యకర్తలు కోరుకునే వారినే ముఖ్యమంత్రిని చేయాలని సూచించానని వివరించారు. ఇతరులు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే పార్టీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతోనే చివరికి సీఎంగా ఉండేందుకు అంగీకరించానని పన్నీర్ సెల్వం తెలిపారు.

 

అడుగడుగునా అవమానం...

సీఎం అయిన తాను పార్టీ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు ప్రయత్నించానని, అయితే తన ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డుతగిలారని పేర్కొన్నారు. ప్రతిసారి తన స్థాయిని తగ్గించాలని చూశారన్నారు. ఆదివారం తనను పోయెస్‌గార్డెన్‌కు పిలిచారని, అప్పటికే అక్కడ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శశికళ కుటుంబ సభ్యులు ఉన్నారని వివరించారు. అక్కడికెళ్లిన తనతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని శశికళ డిమాండ్ చేశారన్నారు. శశికళ వ్యాఖ్యలతో హతాశుడినైన తాను తనకు తెలియకుండా సమావేశం ఎందుకు నిర్వహించారని ప్రశ్నించానని నిలదీశానన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా ఒకరే ఉండాలని, కాబట్టి ఆమెను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నామని ఎమ్మెల్యేలు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని పన్నీర్ చెప్పుకొచ్చారు.

వారితో రెండు గంటలపాటు వాదించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తనతో రాజీనామా చేయించడం సబబేనా అని ప్రశ్నించానని తెలిపారు. అయితే పార్టీ క్రమశిక్షణ కోసం అవమానాన్ని భరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. జయ సమాధి వద్దకు వెళ్తానన్నా అనుమతించలేదన్నారు. తమిళనాడుకు తాను కాకపోయినా రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడే వ్యక్తే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అందుకోసం ఒంటరిగానైనా చివరి వరకు పోరాడేందుకు సిద్ధమని పన్నీర్ సెల్వం ప్రకటించాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Panneerselvam  Revolt  Sasikala  

Other Articles