వేటు ఎఫెక్ట్.. పన్నీర్ కి సోషల్ మీడియాలో ఫుల్ సపోర్ట్... తిరుగుబాటు వెనుక డీఎంకే కుట్ర? | Sasikala hits back at OPS.

Aiadmk removes panneerselvam as party treasurer

O Panneerselvam, Panneerselvam Support, Panneerselvam Delhi Tour, Panneerselvam with Support MLAs, OPS, Panneerselvam Dismiss, AIADMK New Treasurer, DMK Panneerselvam, Sasikala DMK, Tamil Nadu President Rule, Panneerselvam Revolt, Panneerselvam Allegations, Panneerselvam Fire, Panneerselvam Sasikala, Panneerselvam MLAs, Panneerselvam Stalin, Panneerselvam Sacked, Panneerselvam Resignation Forece

Panneerselvam dismissed as AIADMK treasurer; Sasikala says DMK behind revolt. Supporters increased to OPS.

పన్నీర్ పై వేటు... పెరుగుతున్న మద్ధతుదారులు

Posted: 02/08/2017 08:03 AM IST
Aiadmk removes panneerselvam as party treasurer

పన్నీర్ ప్రకటనపై శశికళ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతుండగా, పన్నీర్ మద్దతుదారులు, శశికళ వ్యతిరేక వర్గం వారు సంబరాలు చేసుకున్నారు. అయితే ఉన్నపళంగా తన పై ‘విధేయ సోదరుడు’ ఇలా తిరుగుబాటు జెండా ఎగరవేయటంతో షాక్ తిన్న శశికళ వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలను తన నివాసం పోయెస్‌గార్డెన్‌కు పిలిపించుకుని సమావేశమయ్యారు. పన్నీర్‌ను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో దిండిగల్ శ్రీనివాసన్‌ను నియమించారు. అంతేకాదు దీని వెనుక డీఎంకే హస్తం ఉందని ఆరోపణలకు దిగింది కూడా.

ఇక తనను అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి తప్పించడంపై పన్నీర్‌ సెల్వం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "ఈ పదవి నాకు అమ్మ(జయ) ప్రసాదించింది. నన్ను తీసేసే హక్కు ఎవ్వరీ లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని వీడను. మరి కొద్దిగంటల్లోనే నేనేంటో చూపిస్తా. వేచి చూడండి..' అని గర్హించారు. జయ సమాధి వద్ద మీడియా సమావేశం అనంతరం నేరుగా తన నివాసానికి వెళ్లిపోయిన పన్నీర్‌ సెల్వంను కలుసుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అన్నాడీఎంకేకు చెందిన కీలకనేతలు సైతం పన్నీర్‌ ఇంటికి క్యూకట్టారు. వారిలో అసెంబ్లీ స్పీకర్‌ ధన్‌పాల్‌, సీనియర్‌ ఎంపీ మైత్రేయన్‌ లాంటి ముఖ్యులు కూడా ఉన్నారు.

ఇదే క్రమంలో శశికళకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు పన్నీర్‌ సెల్వం ప్రయత్నాలు ప్రారంభించారు. తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అవసరమైన ఎత్తుగడలను రచిస్తున్నారు. తనను 'ద్రోహి' అని నిందించిన శశికళ వర్గీయులపై మండిపడ్డ సెల్వం.. 'ప్రతిపక్ష నేత(స్టాలిన్‌) ఎదురుపడినప్పుడు నవ్వడం కూడా నేరమేనా? నాకు తెలిసి అలా నవ్వడం నేరమేమీకాదు'అని సెల్వం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం పన్నీర్‌ క్యాంపులో 62 మంది ఎమ్మెల్యేలు చేరిపోయినట్లు తెలిసింది.

ఇదే ఊపులో ఢిల్లీ వెళ్లేందుకు కూడా పన్నీర్‌ సెల్వం సమాయత్తం అయ్యారు. బుధవారం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రులను కలుసుకుని, మంత్రివర్గ ఏర్పాటుకై వినపత్రం ఇవ్వనున్నట్లు స్పష్టంగా సమాచారం. మరోవైపు సోషల్ మీడియాలో కూడా పన్నీర్ కే పట్టాభిషేకం చేయాలంటూ మద్ధతుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panneerselvam  Sasikala  Sack  Tamil Nadu Politics  

Other Articles