మోదీ కూడా ఊహించని ట్విస్ట్... బీజేపీ కోసం పదునైన ఆయుధం | Shiv Sena and Hardik Patel join hands against BJP in Gujarat.

Jolt to bjp with shiv sena hardik patel tie up

Shiv Sena Chief Uddhav Thackeray, Hardik Patel, Hardik Patel Shiv Sena, Shiv Sena Gujarat Elections, Shiv Sena Hardik Patel, Hardik Patel Gujarat Elections, Uddhav Thackeray Hardik Patel, Hardik Patel BJP, BJP Shock, BMC Elections 2017, BMC Elections Uddhav Thackrey

Shiv Sena Chief Uddhav Thackeray announced that Hardik Patel will be face of Shiv Sena poll campaign in Gujarat.

శివసేన-హర్దిక్ పటేల్... వాట్ ఏ ట్విస్ట్!

Posted: 02/07/2017 05:08 PM IST
Jolt to bjp with shiv sena hardik patel tie up

ఇన్నాళ్లూ బీజేపీ మిత్రపక్షంగా సాగిన శివసేన అనూహ్యా నిర్ణయం తీసుకుంది. గుజ‌రాత్‌ ఓటు బ్యాంకు పై కన్నేసిన ఆ పార్టీ అక్కడి ఎన్నికల్లో పోటీ చేయటమే కాదు, స్వతంత్ర్యంగా ముందుకు సాగేందుకు నిశ్ఛయించుకుంది. ఇందుకోసం పటేల్ ఉద్యమ యువనేత, మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించటంలో స్పెషలిస్ట్ అయిన హర్దిక్ పటేల్ ను తమ పార్టీ ప్రచార సారథిగా నియమించుకుంది.

మంగళవారం శివసేన పార్టీ అధినేత ఉద్ధ‌వ్ థాక్రే, హర్దిక్ పటేల్ భేటీ అయి అనంతరం ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. గుజ‌రాత్‌లో జ‌ర‌గ‌నున్న‌ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ నేత‌గా హార్ధిక్ ప‌టేల్ ప్ర‌చారం చేస్తాడని ఉద్ధవ్ తెలిపాడు. శివ‌సేన గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారం హార్ధిక్ ప‌టేల్ సార‌థ్యంలో కొన‌సాగుతుంద‌ని చెప్పారు. మొత్తం 182 స్థానాల్లో పోటీ చేసేందుకు పార్టీ నిర్ణయించుకుంది. గ‌త కొన్నేళ్లుగా హార్ధిక్ ప‌టేల్ త‌మ వర్గానికి ప్ర‌త్యేక రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని పోరాడుతున్నారు. వారికి మా మద్ధతు ఉంటుందని ఉద్దవ్ తెలిపాడు.

ఇక 1995 నుంచి పొత్తుగా సాగుతూ వస్తున్న బీజేపీ-శివసేన బంధం అతి త్వరలోనే విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పులి బోనులో ఉన్నా, బయట ఉన్నా ఒక్కటే. మాకు ఎవరి మద్ధతు అక్కర్లేదు. ఒంటరిగానే బీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించాడు. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవటం, పైగా ఇప్పుడు హర్దిక్ పటేల్ తో గుజరాత్ ఓటు బ్యాంకు గురించి చర్చలు జరపటంతో దాదాపు అది ఖాయంగానే కనిపిస్తోంది.

గుజరాతే ఎందుకు..
మహారాష్ట్రలో గుజరాత్ నుంచి వలస వచ్చిన వాళ్లు, ముఖ్యంగా పటేల్ లు చాలా మందే ఉన్నారు. పైగా స్థానిక ఎన్నికల్లో మొత్తం 227 సీట్లకు గానూ 40 స్థానాల్లో గుజరాతీయుల ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ పోటీ చేయాలని శివసేన బలంగా ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇక మున్సిపల్ ఎన్నికలకు హర్దిక్ మద్దతు కూడా వద్దని చెప్పినప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో పటేల్ క్రేజ్ ను వాడుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv Sena  Uddhav Thackrey  Hardik Patel  Gujarat Elections  

Other Articles