జయలలితను తోసి చంపారు- మాజీ స్పీకర్ .. శశిపైనే డౌటు? | Pandian claims doubts on Jayalalithaa's death Murder.

Ph pandian raises suspicions over jayalalithaa s death

PH Pandian, Chinnamma Sasikala, Sasikala Natarajan, Jayalalithaa's Death, Jayalalithaa Murder, Sasikala Allegations, Pandian Sasikala, Sasikala CM Dream

AIADMK leader, Ex Speaker PH Pandian raises suspicions over Jayalalithaa's death. Claims foul play in Jayalalithaa's death, hints at 'Chinnamma'.

జయలలిత హత్య..! హింటా? క్లారిటా?

Posted: 02/07/2017 02:43 PM IST
Ph pandian raises suspicions over jayalalithaa s death

ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న శశికళ కల.. కలగానే మిగిలిపోతుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ ఆమెపై సంచలన ఆరోపణలు చేశాడు. పోయిస్ గార్డెన్ లోని తన నివాసంలో జయలలితను ఎవరో కిందకు పడదోశారని, తీవ్రగాయాల పాలైన ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు నాటకమాడి, ఆమెను హత్య చేశారంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర కలకలం సృష్టించాడు.

మంగళవారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పోయిస్ గార్డెన్ లో జయలలితతో వాదన పెట్టుకున్న ఒకరు, ఆమెను గట్టిగా నెట్టి కిందకు పడదోశారని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 22న ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. జయలలిత మరణం తరువాత శశికళ కనీసం విచారాన్ని వ్యక్తం చేయలేదని పాండియన్ నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో శశికళకు సీఎం అయ్యే అవకాశాలు వస్తాయన్న అనుమానం జయలలితకు ఉండేదని, అలా జరగడం తనకు ఇష్టం లేదని జయలలిత ఓ సారి తనతో చెప్పారని పాండియన్ కుమారుడు, మాజీ ఎంపీ మనోజ్ వ్యాఖ్యానించారు.

జయలలిత మృతి వెనుక ఎలాంటి వివాదాలు లేవని లండన్ వైద్యుడు రిచర్డ్ బేలె వెల్లడించిన మరుసటి రోజు పాండియన్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. త‌మిళ‌నాడు ప్ర‌తిపక్ష నేత స్టాలిన్ ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై డీఎంకే మ‌రింత ముందుకు వెళ్లాల‌ని భావిస్తోంది. త‌మిళ‌నాడు సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌నుకుంటున్న‌ శ‌శిక‌ళ నిర్ణ‌యానికి వ్య‌తిరేకత తెలుపుతూ రేపు ఆ పార్టీ నేతలు ఢిల్లీకి బయలుదేరి ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీని కలవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

మరోవైపు గవర్నర్ కూడా సహకరించకపోవటం, దీనికి తోడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అన్నాడీఎంకే నేతల సంఖ్య రాను రాను పెరిగిపోతుండటం పెను సంక్షోభం దిశగా తమిళ రాజకీయం అడుగు వేస్తుందన్న భయం వ్యక్తం చేస్తున్నారు అక్కడి రాజకీయ నిపుణులు. ఒకవేళ అదే జరిగితే ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలన ఖాయంగానే కనిపిస్తోంది. చూద్దాం ఏం జరగబోతుందో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sasikala Natarajan  Jayalalithaa  Death  Murder  PH Pandian  

Other Articles