ఢిల్లీ విమానాశ్రయంలో హైడ్రామా.. వెళ్లిపోయిన ఫైలట్ high drama at new delhi igi airport

High drama at new delhi igi airport

indira gandhi international airport, new delhi-vijayawada bound plane, supreme court justice nv ramana, minister kamineni srinivas, union minister ashok gajapathi raju, air india, vijayawada, 120 passengers on board, gannavaram, amaravathi

high drama prevails at new delhi indira gandhi airport, as vijayawada bound air-india plane pilot leaves plane saying that his flying hours has been completed

ఢిల్లీ విమానాశ్రయంలో హైడ్రామా.. వెళ్లిపోయిన ఫైలట్

Posted: 02/03/2017 06:49 PM IST
High drama at new delhi igi airport

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై డ్రామా కోనసాగింది. న్యూఢిల్లీ నుంచి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సిన విమానం కాసేపట్లో టేకాఫ్ అవుతుందన్న సమయంలో ఫైలట్ ఏకంగా తన క్యాబిన్ వదలి వెళ్లిపోయారు. దీంతో టేకాఫ్ కావాల్సిన విమానం ఎందుకని విమానాశ్రయంలోనే నిలిచిపోయిందన్న విషయం తెలియక ప్రయాణికలు అందోళన వ్యక్తం చేశారు. తీరా ఫైలట్ చెప్పిన కారణం విన్న తరువాత ప్రయాణికులతో పాటు అందులో ప్రయాణంచేస్తున్న ప్రముఖలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలు దేరాల్సిన విమానం టేకాఫ్ కు రెడీగా వుంది. అంతలో ఏమైందో ఏమో కానీ ఆ విమాన ఫైలట్ అలిగి పెళ్లిపోయాడు. అదేంటి అతను ఎందుకు అలిగి వెళ్లాడని సిబ్బంది అరా తీయగా, తన ఫ్లయింగ్ అవర్స్ అయిపోయాయని, అందుకనే తానే వెళ్తున్నట్లు సిబ్బందికి తెలిపాడని సమాచారం. దీంతో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి రావాల్సిన విమానం.. దాదాపుగా రెండు గంటల పాటు విమానాశ్రయంలోనే నిలిచిపోయింది.

దీంతో విమానంలో వున్న సుమారు 120 మంది ప్రయాణికులు ఫైలట్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రయాణికులలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణతో పాటు రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా వున్నారు. మరీ అలస్యం అవుతన్న కారణంగా విషయాన్ని మంత్రి కామినేని, కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో అయన సదరు పైలట్ స్తానంలో ప్రత్యామ్నాయంగా మరో పైలెట్ ను పంపించారు

సాయంత్రం 5.45 గంటల నుంచి ప్రయాణికులందరూ విమానంలోనే వుండిపోయారు. రెండు గంటల గడిచినా ఫైలట్ రాకపోవడంతో విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందా అని ఎదురుచూస్తూ ఉండిపోయారు. కాగా, ప్రత్యామ్నాయ ఫైలట్ రాకతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విమానం ఎప్పుడు బయలుదేరాల్సింది.. ఎప్పుడు బయలుదేరింది..? ఎవరి వల్ల అలస్యమైంది..? ఎందుకు ఫైలట్ అలిగి వెళ్లిపోయాడు. అతనిపై ఎవరు ఒత్తిడి తీసుకువచ్చారు. అన్న కారణాలు మాత్రం తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kamineni srinivas  ashok gajapathi raju  air india  vijayawada  gannavaram  new delhi  

Other Articles