కన్నుకు కన్ను తీర్పును వెలువరించి సుప్రీంకోర్టు Iranian woman to be blinded in 'eye-for-an-eye' retribution

Iranian woman to be blinded in eye for an eye retribution

Iranian woman, Iran supreme court, 'eye-for-an-eye', retribution, Sima, blood money, Majid Karami, Iran’s Sharia law, women’s rights, human rights, judgement

An Iranian woman is to be blinded in one eye as punishment for an acid attack that left her victim without sight, the country’s Supreme Court has ruled.

కన్నుకు కన్ను తీర్పును వెలువరించి సుప్రీంకోర్టు

Posted: 02/03/2017 05:32 PM IST
Iranian woman to be blinded in eye for an eye retribution

అటవిక న్యాయం అంటే తెలుసునా..? ఒకరి మరణానికి కారణమైన వారిని మరణంతోనే శిక్షించడం. ఒకరి చేయికి, కాలుకి, కంటికి, కర్ణానికి ఇలా దేనిని కొల్పోవడానికి కారణమైన వారిలో అదే అవయవాన్ని తొలగించాలనడం.. ఒకనాటి గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లోని కుల పంచాయితీల్లో, అడవుల్లో వుండే గిరిజనలతో పాటు పలువురు ఇదే తరహా తీర్పులను పాటించేవారు. ఇది న్యాయం కాదని ఎందరు చెప్పినా వినకుండా మెండిగా వ్యవహరించేవారు. అయితే అలాంటివారిని కఠినమైన శిక్షలు వేస్తామని భారత ప్రభుత్వాలు హెచ్చరించిన మీదట.. మార్పు సాధ్యమైంది.

అయితే ఇదే తరహా తీర్పును ఏకంగా న్యాయస్థానాలు వెలువరిస్తే.. అది తప్పకుండా వింతగానే వుంటుంది. ఇక ఓ దేశానికి చెందిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ తరహా తీర్పును వెలువరించింది. దీంతో ఆ తీర్పు పట్ల యావత్ ప్రపంచం విస్మయం వ్యక్తం చేసింది. నమ్మశక్యం కాకపోయినా ఇదే జరిగింది. ఓ మహిళపై మరో మహిళ యాసిడ్ పోసిన ఘటనలో ఇరాన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సరిగ్గా అటవిక న్యాయాన్ని ఈ తీర్పు గుర్తుచేసింది.

రెండేళ్ల క్రితం సీమా అనే మహిళపై మరో మహిళ యాసిడ్ పోసింది. ఆ ఘటనలో బాధితురాలు కంటి చూపును కోల్పోయింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు... కంటి చూపును కోల్పోవడానికి కారణమైన నేరస్తురాలికి ఒక కన్ను పీకేయాలంటూ తీర్పును వెలువరించింది. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం ఈ తీర్పును ఇచ్చింది. అంతేకాదు, బాధితురాలికి నష్ట పరిహారం చెల్లించాలని, ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించాలని ఆదేశించింది. 1979లో ఇరాన్ లో షరియా చట్టం అమల్లోకి వచ్చింది. శారీరక గాయాలు ఏర్పడిన కేసుల్లో ప్రతీకార శిక్షలకు షరియా చట్టం అనుమతిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles