సురేష్ రైనా.. ఆరేళ్ల బాలుడ్ని గాయపర్చాడు..! Suresh Raina injures 6-year-old boy in Bengaluru

Suresh raina injures 6 year old boy in bengaluru

suresh raina, india vs england, bengaluru t20, chinaswamy stadium, satish, raina 6 yr old boy, Dr Mathew Chandy, karnataka

Satish, A six-year-old boy, sitting in the stands of M Chinnaswamy Stadium during the final of T20 series between India and England, was injured when a six off Suresh Raina's bat hit him.

సురేష్ రైనా.. ఆరేళ్ల బాలుడ్ని గాయపర్చాడు..!

Posted: 02/02/2017 12:07 PM IST
Suresh raina injures 6 year old boy in bengaluru

సురేష్ రైనాకు కోసం వచ్చింది. ఎంతలా అంటే.. ఒకనాటి తన సత్తాను మరోమారు చాటుకున్నాడు రైనా. కేవలం 45 బంతుల్లో 63 పరుగులు చేసి తన బ్యాట్ ఝుళిపించాడు. అదే సమయంలో ఒక చిన్నబాలుడ్ని గాయపర్చాడు. ఆట మధ్యలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మైదానంలో మ్యాచ్ అడుతున్న రైనా.. మ్యాచ్ ను వీక్షించేందకు వచ్చిన సతీష్ అనే అరేళ్ల బాలుడ్ని గాయపర్చాడు. అదేలా అని కంగారుపడకండి.. వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..

ఇంగ్లాండ్ తో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతన్న చివరి టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుతూ, అదే సమయంలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ.. స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన సురేష్ రైనా.. 45 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. 140 స్ట్రైక్ రేట్తో రాణించిన రైనా.. టాప్ స్కోరర్ గా నిలవడంతో పాటు ఫీల్డింగ్‌లో కూడా మరెవరికీ సాధ్యం కాని అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
 
అయితే, రైనా కొట్టిన ఐదు సిక్సర్లలో ఒకటి ఏకంగా ప్రేక్షకుల మధ్యకు వెళ్లింది. ఇలా చాలాసార్లు బ్యాట్స్‌మన్ కొట్టిన సిక్సర్లు ప్రేక్షకుల్లోకి వెళ్లడం, వాళ్లు వాటిని క్యాచ్ పట్టి సంబరం చేసుకోవడం వెంటనే కెమెరాలు వారిని చూపడం.. క్యాచ్ పట్టినవారి అనందానికి అంబరమే హద్దుగా నిలిచిన ఘటనలు వున్నాయి. అయితే, రైనా కోట్టిన సిక్స్ మాత్రం ఆరేళ్ల కుర్రాడికి తగిలింది. అది కూడా సరిగ్గా తొడమీద పడింది. దాంతో అతడికి తొడమీద కొద్దిపాటి గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతున్న ఆ పిల్లాడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స అందించి అనంతరం డిశ్చార్జి చేశారు.    

ఇదే గాయం తలపైన కానీ లేక మెడపైన కానీ తగిలివుంటే పిల్లాడు ప్రాణాలకే  ప్రమాదం సంభవించేదని సతీష్ ను చికిత్స చేసిన డాక్టర్ మాథ్యూ చాండే తెలిపారు. కాగా, 2012 లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, పూణే వారియర్స్ మధ్య జరుగుతన్న మ్యాచ్ లో ఓ బ్యాట్స్ మెన్ కొట్టిన సిక్స్ వెళ్లి ఏకంగా పదేళ్ల పాప ముఖానికి తగిలిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles