బాలయ్య కొంపముంచుతున్నది ఎవరో తెలుసా..? proxy leader damages balakrishna's image

Proxy leader damages balakrishna s image

balakrishna’s personnel assistant turned to be a proxy leader, balayya pa shekar, chandra shekar, Venkatarayudu shekar, proxy leader, chandrababu naidu, nandamuri balakrishna, hindupur of anantapur district, tdp, latest tollywood news, latest telugu news

Former TDP MLA C C Venkatarayudu was protesting against the highhanded attitude of Balakrishna’s personal assistant and seeking his immediate removal by realising ground realities in the constituency.

బాలయ్య కొంపముంచుతున్నది ఎవరో తెలుసా..?

Posted: 02/02/2017 11:35 AM IST
Proxy leader damages balakrishna s image

అటు సినీమాలలో హిట్ మీద హిట్ కోడుతూ తన వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో శతచిత్రాలను పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. ఇటు రాజకీయాలలో కూడా బిజీగా మారారు. అయితే తాను సినిమాలలో బిజీగా వున్న కారణంగా చేత ప్రతినిత్యం ప్రజలకు, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో వుంటే అవకాశం లేనందున ప్రతీ రెండు, మూడు నెలలకు ఓసారి మాత్రం నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అయితే తాను నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో లేనన్న బాధ, అసంతృప్తి పార్టీ శ్రేణులకు, నియోజకవర్గ ప్రజలకు లేకుండా చేయాలని భావించిన ఆయన ప్రజలకు నిత్యం అందుబాటులో వుండేలా ఒక వ్యక్తిగత సహాయకుడ్ని (పీఏ)ను నియమించుకున్నారు. అయితే తొలుత అంతా సవ్యంగానే సాగినా.. రానురాను పీఏ శేఖర్ మాత్రం బాలకృష్ణ తరువాత తానే ఎమ్మెల్యేను అన్న రీతిలో వ్యవహరించడం నియోజకవర్గ నాయకులకు రుచించడం లేదు.

బాలకృష్ణపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని నిర్మోహమాటంగా చెబుతున్న హిందూపురం టీడీపీ నేతలు.. శేఖర్ తలబిరుసు, అవినీతిపై మాత్రం సహించలేకపోతున్నామని స్పష్టం చేశారు. శేఖర్ ను పీఏగా తొలగించేంత వరకు తాము ఊరుకునేది లేదని తేల్చిచెబుతున్నారు. తమను కాదని, హిందూపుర్, లేపాక్షి, చిలమట్టూర్ పురపాలక సంఘాలలో తన ఇస్టానుసారం వ్యవహరిస్తున్నారని, పార్టీ శ్రేణులను కాదని ఎందుకిలాంటి చర్యలు చేపడుతున్నారో అర్థం కావడం లేదని నేతలు తీవ్రస్తాయిలో ఫైర్ అవుతున్నారు.

శేఖర్ ను తొలగించాలంటూ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సిసి. వెంకటరాయుడు అమరణ దీక్షకు పూనుకుంటున్నట్లు ప్రకటించారు. ముందుగా నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయాలను సేకరిస్తున్న ఆయన అందరి అభీష్టం మేరకు శేఖర్ ను తక్షణం పీఏ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హిందూపూర్, లేఫాక్షి మండలాల్లో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్న ఆయన ఈ నెల 5న చిలమట్టూర్ మండలంలోనూ అభిప్రాయ సేకరణ కోసం సమావేశాన్ని నిర్వహించనున్నారు.

తన వ్యక్తిగత సహాయకుడు శేఖర్ పార్టీ నేతలు, కార్యకర్తల మనోబిష్టానికి వ్యక్తిరేకంగా వ్యవహరిస్తున్నారని స్థానిక మీడియాతో పాటు ఇటు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నా.. బాలకృష్ణకు ఈ విషయం తెలియదా..? అన్న విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. బాలకృష్ణ డైరెక్షన్ లోనే శేఖర్ వ్యవహరిస్తున్నారా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సినీరంగంలో శతకర్ణి బాలయ్య.. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు, కానీ రాజకీయాల్లో ముక్కుసూటి తత్వంతో వ్యవహరించిన స్వర్గీయ ఎన్టీరామారావు, అంధ్రుల అన్న.. వారసత్వాన్ని నిలబెట్టుకుంటారా.. లేదా..? అన్నది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  proxy leader  chandra shekar  venkatarayudu  hindupur  

Other Articles