అనవాయితీకి బ్రేక్ ఇచ్చిన మోడీ సర్కార్..! modi government breaks parliament custom

Modi government breaks parliament custom

PM modi, narendra modi, arun jaitley, finance minister, nda government, budget 2017-18, financial year budget, congress, mallikarjun kharge, lalu prasad yadav, rjd, parliament, JDU, MP Ahmed death, deve gowda

modi government breaks parliament custom of adjourning the house after the demise of siting member of parliament.

అనవాయితీకి బ్రేక్ ఇచ్చిన మోడీ సర్కార్..!

Posted: 02/01/2017 10:43 AM IST
Modi government breaks parliament custom

బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున మోడీ సర్కార్ అనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని పక్కన బెట్టిందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. సిట్టింగ్‌ ఎంపీ చనిపోయినప్పటికీ బడ్జెట్‌ను యధావిధిగా ప్రవేశపెట్టాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపట్టాయి. ఐదు పర్యాయాలు పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుడు మరణానికే సభ సంతాపాన్ని వ్యక్తం చేసి గౌరవాన్ని ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించాయి. ఒకవైపు సహచరుడు మరణించి ఉండగా, సభను జరపడడం, బడ్జెట్‌ను ప్రకటించడం సంప్రదాయానికి విరుద్ధమని కాంగ్రెస్‌, జేడీయూ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు మండిపడ్డాయి.

కేరళలోని మళప్పురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిత్యం వహిస్తున్న ఎంపీ అహ్మద్ మరణవార్తను ప్రకటించడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఖర్గే అరోపించారు. ఎంపీ అహ్మద్  మంగళవారం సభలోనే గుండెపోటుకు గురయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ఉభయసభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నతరుణంలోనే ఈ ఘటన జరిగింది. పార్లమెంట్‌ సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం 2:30కి కన్నుమూశారని కానీ బడ్జెట్ ను ఎలాగైనా ప్రవేశపెట్టాలన్న ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ఆయన మరణవార్తను ఇవాళ ఉదయం అధికారికంగా ప్రకటించిందని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖార్గే అరోపించారు.సీనియర్‌ సభ్యుడి మరణానికి సంతాపంగా సభను వాయిదావేయాలని డిమాండ్‌ చేశారు.

ఎంపీ మరణం నేపథ్యంలో సభ జరపాలా? వద్దా? అనేదానిపై సమాలోచనలు జరుగుతున్న తరుణంలోనే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ సూట్‌కేసుతో రాష్ట్రపతిని కలవడాన్ని మాజీ ప్రధాని దేవేగౌడ  తప్పుపట్టారు. ‘ఆర్థిక మంత్రి సూట్‌కేసు పట్టుకుని హడావిడిగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాల్సిన అవసరంలేదు. నిజానికి బడ్జెట్‌ ప్రభుత్వం సంకల్పిస్తే బడ్జెట్‌ వాయిదా పెద్ద కష్టమేమీకాదు. హడావిడి సృష్టించడం ద్వారా బడ్జెట్‌ వాయిదా వేయకూడదనే తన సంకల్పాన్ని ప్రభుత్వం బయటపెట్టకుంది’అని దేవేగౌడ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles