విత్ డ్రా లిమిట్ ఎత్తేస్తారా? పాత నోట్లు డిపాజిట్ చేసుకోవ‌చ్చా? | Cash withdrawal restrictions likely End.

Cash withdrawal curbs may be lifted by feb end

Reserve Bank of India, Cash Withdrawal, Cash withdrawal Limit, RBI Cash Withdrawal, Old Notes Deposit, Withdrawal Curbs, Old Notes 2017, RBI Key Decision

Cash withdrawal restrictions likely to go away by February-end. And Old notes also accept banks as deposit.

ఆర్బీఐ మరో కీలక నిర్ణయం?

Posted: 01/27/2017 11:40 AM IST
Cash withdrawal curbs may be lifted by feb end

నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్ల కోసం ఇబ్బందిపడ్డ ప్రజలకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నగదు విత్ డ్రా కు సంబంధించి అతి త్వరలో తీపి క‌బురు అంద‌నుందంట. విత్‌డ్రాపై విధించిన ఆంక్షల‌ను పూర్తిగా తీసేసేందుకు ఆర్బీఐ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు తమకు ముందస్తు సమాచారం కూడా అందజేసినట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, మొద‌ట్లో రూ.2 వేల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన విత్ డ్రాయల్స్‌ను త‌ర్వాత రూ.2,500కు, ప్ర‌స్తుతం రూ.10వేల‌కు పెంచిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం న‌గ‌దు చ‌లామ‌ణి పెరిగి క్ర‌మంగా సాధార‌ణ ప‌రిస్థితుల‌కు చేరుకుంటుండ‌డంతో ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి ఆ ఆంక్ష‌ల‌ను పూర్తిగా ఎత్తివేయాల‌ని ఆర్బీఐ భావిస్తున్న‌ట్టు బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ఆర్కే గుప్తా తెలిపారు.

ఇక పెద్ద నోట్ల రద్దు తర్వాతి రద్దయిన పాత నోట్లను ఇంకా కలిగి ఉన్న వారికి గుడ్ న్యూస్ అందించేందుకు ఆర్బీఐ రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తమ దగ్గర కొద్దో గొప్పో మిగిలి ఉన్న పెద్ద నోట్లను నేరుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ మరోసారి వెసులుబాటును కల్పించవచ్చని వార్తలు వస్తున్నాయి. నోట్ల మార్పిడికి కాకుండా కేవలం డిపాజిట్లకే ఈ వెసులుబాటును ఇవ్వవచ్చని ఆర్బీఐ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక కథనం రాసింది. సహేతుక కారణాలను వివరిస్తూ పాత నోట్లను ఆర్బిఐ నిర్దేశిత కౌంటర్లలో డిపాజిట్ చేసేందుకు గడువు మార్చి 31వ తేదీ వరకు ఉన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reserve Bank of India  Cash Withdrawal  Old Notes  

Other Articles

Today on Telugu Wishesh