గోవధ బ్యాన్ పై సుప్రీంకోర్టు సారీ చెప్పేసింది | sc dismisses cow slaughter Ban PIL.

Sc rejects plea seeking ban on cow slaughter

Supreme Court of India, Supreme Court Cow Slaughter, Cow Slaughter Ban India, Cow Slaughter India, Cow Slaughter PIL, Cow Slaughter Indian States, Cow Slaughter Ban States, Maharashtra Cow Slaughters, Supreme Court PIL Dismiss

Supreme Court Rejects Plea Seeking Complete Ban On Cow Slaughter. One state may ban slaughter, the other may not... We will not interfere in state laws," the Supreme Court said as it rejected the petition seeking a uniform policy on cow slaughter.

గోవధపై బ్యాన్... సుప్రీం సారీ చెప్పేసింది

Posted: 01/27/2017 03:14 PM IST
Sc rejects plea seeking ban on cow slaughter

గోవధను నిషేధించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. జంతువుల అక్రమ రవాణాను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కట్టడి చేశాయని, అలాగని గోవధ పై నిషేధం విధించాలంటూ రాష్ట్రాలను పూర్తిగా ఆదేశించలేమంటూ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

మహారాష్ట్ర, హరియాణా, మధ్యప్రదేశ్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు గోవధను, గోమాంసాన్ని నిషేధించాయి. ఈ నేపథ్యంలో.. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అదే విధానాన్ని అవలంభించాలని ఒక వర్గం నుంచి డిమాండ్ వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు వినీత్ సహాయ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ వేశారు.

అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలలో గోవధను సమూలంగా నిషేధించాలని, కబేళాలు ఎత్తేసేలా ఉత్తర్వులు జారీచేయాలన్న కుదిరేపని కాదని స్పష్టం చేసింది. సదరు వ్యాజ్యం విచారణకు ఏమాత్రం అర్హం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 'కొన్ని రాష్ట్రాలు గోవధను నిషేధించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు అలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రాలు రూపొందించుకునే చట్టాలపై మేం జోక్యం చేసుకోలేం. దేశమంతటా గోవధను నిషేధించేలా ఆదేశాలు ఇవ్వలేం..' అని తేల్చి చెప్పింది.

కాగా, గతేడాది ఆగష్టులో మహారాష్ట్రకు చెందిన 36 మంది డీలర్లు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 16 ఏళ్లు దాటిన గోవులు వట్టిపోతాయని, అలాంటి వాటిని వ్యవసాయానికి కాదు కదా ఎందుకు ఉపయోగించలేమని, అందుకే వాటితో వ్యాపారం చేసేందుకు అనుమతించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Cow Slaughters  Ban  India  PIL  Dismiss  

Other Articles