హీరోయిన్ భర్త కాంట్రవర్సీ కామెంట్లు... ముస్లింలను కండోమ్ లా ట్రీట్ చేస్తున్నారు | Ayesha Takia Husband Controversy Comments.

Farhan azmi controversial remark on muslims

Abu Azmi, Abu Azmi Muslims, Indian Muslims, India Muslims Political Parties, Ayesha Takia Husband, Abu Azmi Controversy, Abu Azmi Father, Abu Azmi Son, Samajwadi Party Abu Azmi

Samajwadi Party youth leader and party state president Abu Azmi’s son from Mumbai Farhan Azmi has made a controversial remark at a public meeting this week. Farhan Azmi a famous restaurateur and husband of Bollywood actress Aisha Takia said, ‘different political parties have used Muslims as condoms’. Soon after the controversial comment the youth leader faced heavy criticism from Muslim leaders and called it an irresponsible and offensive remark and have sought an apology.

ముస్లింలపై యువనేత వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 01/27/2017 10:39 AM IST
Farhan azmi controversial remark on muslims

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే ముసలం తో సతమతమవుతున్న సమాజ్ వాదీ పార్టీకి మరో వివాదం మెడకు చుట్టుకుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన అబూ అజ్మీ కుమారుడు, యువనేత ఫర్హాన్ అజ్మీ ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పార్టీలన్నీ ముస్లింలను కండోమ్ లా వాడుకుంటున్నాయంటూ పేర్కొన్నాడు.

ముంబైలో జ‌ర‌గ‌నున్న బీఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌కు తండ్రితో క‌లిసి హాజ‌రైన ఫ‌ర్హాన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.రాజ‌కీయ పార్టీలు ముస్లింల‌ను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, వారిని కండోమ్ లా వాడుకుంటూ పక్కన పడేస్తున్నాయంటూ వ్యాఖ్యానించి క‌ల‌కలం రేపాడు.  మరోవైపు ఆ వ్యాఖ్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ముస్లింల‌ను కండోముల‌తో పోల్చ‌డం ద్వారా మొత్తం ముస్లిం మ‌తాన్నే అవ‌మానించారంటూ ముంబై బీజేపీ అధ్య‌క్షుడు హైదర్ ఆజం ధ్వ‌జ‌మెత్తారు.

స‌మాజ్‌వాదీ పార్టీ వైఖ‌రిని ఆయ‌న మాట‌లు బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్నాయ‌ని ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ ప‌ఠాన్ ఆరోపించారు. అయితే తాను కించ‌ప‌రిచేందుకు ఆ మాట‌లు అన‌లేద‌ని, దేశంలో ముస్లింల ప‌రిస్థితి గురించి మాత్ర‌మే అన్నాన‌ని ఫ‌ర్హాన్ వివ‌ర‌ణ ఇచ్చారు. మరోపక్క ముస్లిం నేతలు ఫర్హాన్ ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధం అయిపోయారు. కాగా, ముంబైలో ఇన్ఫినిటి పేరుతో హోటళ్లు నిర్వహించే ఫర్హాన్ నటి అయేషా టకియా భర్త కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abu Azmi  Controversial Remark  Muslims  

Other Articles

Today on Telugu Wishesh