ఎంపీల అవినీతి, చంద్రబాబు కేసు, బీజేపీ పాలన, వర్మ గురించి సంచలన వ్యాఖ్యలు | Pawan Kalyan fire on BJP and TDP again

Pawan kalyan fire on bjp and tdp again

Pawan kalyan, Janasena Pawan kalyan, Janasena Press Meet, Pawan Kalyan on RGV tweets, Janasena Press Meet, Pawan Kalyan BJP, Pawan Kalyan Chandrababu Naidu, Pawan kalyan, Pawan Kalyan Chnadrababu Naidu, Pawan Sujana Chowdary, Pawan kalyan Rayapati Sambasiva Rao

Pawan kalyan fire on BJP and TDP again in Press Meet over AP Special Status. Pawan Kalyan on Ram Gopal Varma tweets,

బానిసలు తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తారు : జనసేన చీఫ్

Posted: 01/27/2017 10:08 AM IST
Pawan kalyan fire on bjp and tdp again

ఉధృతిని వాయిదా వేశారుగానీ దానిని ఆపలేరంటూ ప్రత్యేక హోదాపై పోరాటం గురించి పేర్కొన్నాడు. ఒక రోజు ఒకమాట ఇంకోరోజు మరోమాట చెబితే జనాలు ఊరుకుంటారా? అని ప్రశ్నించాడు. యువత పోరాటానికి (మౌన ప్రదర్శన) ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సిందని, కనీసం ఒక గంట అయినా సడలింపు ఇచ్చుంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. పందులు, పందేలు అంటూ సుజనాచౌదరి కోట్ల మంది మనోభావాలు దెబ్బ తీశాడు. మరి బ్యాంకులకు సొమ్ములు ఎగ్గొట్టింది ఆయన మరిచిపోయారా అంటూ ప్రశ్నించాడు. మరో ఎంపీ రాయపాటి ప్రస్తావన తీసుకొస్తూ ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవకతవకలపై ఓ జ్యుడిషియల్ కమిటీని వేయాలని డిమాండ్ చేశాడు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులకే ప్యాకేజీ ముసుగు వేశారంటూ ఆరోపించాడు. దక్షిణాది నుంచి ఓట్లు రావటంలేదనే ప్రజల సమస్యలపై పట్టించుకోవటం లేదన్నాడు. ప్రత్యేక హోదా గతించిన అధ్యయనం అంటూ దాటవేత ప్రదర్శించటం సరికాదన్నాడు. డీ మానిటైజేషన్ పై చంద్రబాబు ఐదురకాలుగా మాట్లాడారు. అసలు హోదా విషయంలో ఆయన కేంద్రంతో ఎందుకు రాజీ పడుతున్నారో అర్థం కావటం లేదంటూ ప్రశ్నించాడు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం అనున్నది సాధిస్తుందన్నాడు. మోదీగారు మీరు భయపెట్టి పాలిస్తే ఎలా అంటూ ప్రస్తావించాడు. బానిసలుగా భావిస్తున్నరేమో, తిరగబడితే ఎలా ఉంటుందో తెలుస్తుందని పేర్కొన్నాడు.

గతంలో చంద్రబాబునాయుడు 'నోట్ ఫర్ ఓట్' కుంభకోణంలో చిక్కుకున్న వేళ, తననుంచి ఒక్క మాట కూడా రాలేదన్న విమర్శలకు పవన్ సమాధానం ఇచ్చారు. ఆనాడు తాను మాట్లాడకపోవడానికి కారణాన్ని వివరిస్తూ, "అది ఒక్క తెలుగుదేశం పార్టీ చేసుండుంటే, అంతకుముందు అలా ఎవరూ చేయకుండా ఉండుంటే, నేను కచ్చితంగా, బలంగా నిలదీసి వుండేవాడిని. అన్ని పార్టీలూ హార్స్ రైడింగ్ చేస్తాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాన్ని నేను వెనకేసుకు రావడమనుకోండి, ఇంకేమైనా అనుకోండి... నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి దానికీ గొడవలు పెట్టుకుంటే... ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రాలు మనవి. ప్రభుత్వాలను ఇబ్బంది పెడితే, ప్రజలకు నష్టం కలుగుతుందే తప్ప, పనులు ముందుకు సాగవని చూసీ చూడనట్టు మాట్లాడాను. అది తెలిసో తెలీకో కాదు... తెలిసే" అని పవన్ చెప్పాడు.

దక్షిణాది రాష్ట్రాల అణచివేతపై మరోసారి ఉద్ఘాటించిన పవన్ ఓట్ల కోసమే రెండు జాతీయ పార్టీలు వాడుకుంటున్నాయన్నాడు. వర్మ విమర్శల ట్వీట్లపై ప్రశ్నించిన మీడియాతో ఘాటుగానే స్పందించాడు. 50 ఏళ్లు పైబడిన వ్యక్తి, పైగా బూతు సినిమాలు చూస్తానని చెప్పేవాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ తెలిపాడు. తనకు కుటుంబం, పిల్లలు ఉన్నారని, సినిమాలను కూడా పక్కనబెట్టి తాను ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ముందుకు వస్తుంటే విమర్శించటం సరికాదంటూ వ్యాఖ్యానించాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena Press Meet  AP Special Status  

Other Articles