హోదా అడుగుతుంటే రాజకీయాలు తెలుసా అని అడుగుతారా? | Pawan press meet on AP Special Status.

Pawan kalyan press meet on ap special status

Janasena, Pawan Kalyan Press Meet, AP Special Status, Pawan Kalyan Silent Protest Absent, Janasena Pawan Kalyan press meet, Janasena on Peaceful Protest

Janasena Pawan Kalyan press meet on AP Special Status after Silent Protest failure.

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు: పవన్ కళ్యాణ్

Posted: 01/27/2017 09:45 AM IST
Pawan kalyan press meet on ap special status

ప్రత్యేక హోదా కోసం వైజాగ్ ఆర్కే బీచ్ లో చేపట్టిన నిరసన ప్రదర్శనకు కేవలం మద్ధతు మాత్రమే ప్రకటించాడని, ట్విట్టర్ పులిగానే గర్జించాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో తన వివరణ ఇచ్చుకున్నాడు.

ఏపీ నేతలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ప్రత్యేక హోదా అడుగుతుటే రాజకీయాలు తెలుసా అని అడుగుతున్నారు. మరి ఎన్నికల వేళ మద్దతిచ్చినప్పుడు తనకు రాజకీయ అనుభవం ఉందా? అన్న ప్రశ్న తలెత్తలేదని, ఆనాడు ఈ ప్రశ్నను సిద్ధార్థ నాథ్ సింగ్ అడగలేదే అని పవన్ అన్నాడు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు తనను తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు తిప్పారని, బతిమిలాడి తెలంగాణ అంతటా పర్యటనలకు పంపారని పవన్ గుర్తు చేశాడు. ఆనాడు ప్రచారానికి అవసరం లేని రాజకీయ అనుభవం నేడెందుకని పవన్ ప్రశ్నలు సంధించారు. హోదా గురించి అడిగితే, తనకు రాజకీయాలపై ఏబీసీడీలు తెలియవని, నేర్చుకుని రమ్మంటున్నారని, ఇంతకు మించిన అవకాశవాదం ఇంకేముంటుందని అడిగారు

బీజేపీ ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు పోతుంటే బీజేపీపై కోపాన్ని ప్రజలు జల్లికట్లు రూపంలో చూపించారన్నాడు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిపోయింది. ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశంతోనే మోదీ,బాబుకు మద్ధతునిచ్చాను. మూడేళ్లు ఎదురు చూశాను కానీ ఎటువంటి పురోగతి లేదు. ఆ ఆవేదనతో నే జనసేన పార్టీని స్థాపించాను. పరిష్కారం చేయాల్సిన సమస్యలను ఆలసత్వం చేశారు.

మీ ఇష్టానికి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించాడు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ను ఉద్దేశిస్తూ  "ఏమనుకుంటున్నారండీ మీరు... మీరు స్వర్ణభారత్ ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పెట్టివుంటే, ఈ పాటికి ప్రత్యేక హోదా వచ్చుండేది. స్వర్ణ భారత్ ట్రస్ట్ పై పెట్టినంత మనసు ప్రజా సమస్యల పరిష్కారంపై పెట్టలేదు. ఆయన పదజాలం ఎలా ఉంటుందంటే... స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాలు కాదు. పది సంవత్సరాలు ప్రసాదిస్తామంటారు. ప్రసాదించడానికి మీరు అందరిలాంటి మనుషులు కాదా? ప్రత్యేకించి దిగొచ్చారా? ఢిల్లీ రక్షణ కవచాల్లో కూర్చుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పైనుంచి దిగొచ్చామనుకుంటున్నారా? మేమందరూ మీ బానిసలమా? ఏమనుకుంటున్నారు? మేమీ దేశ ప్రజలం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. మూడు సంవత్సరాల్లో ఇన్ని రకాలుగా మాటలు మార్చారు. ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు సన్మానాలు చేయించుకోవచ్చు. ఏదైనా చేయించుకోండి. కానీ నమ్మకాన్ని నిలుపుకోండి" అంటూ తెలిపాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan kalyan  Peaceful Protest  Press Meet  

Other Articles

Today on Telugu Wishesh