కవిత మోకాళ్ల దగ్గర ఐఏఎస్.. కాళ్లు మొక్కుతానన్న మరో కలెక్టర్ | Sub Collector sit in front of MP kavitha.

Telangana collectors attitude at rd celebrations

Telangana Collectors, Collector Sharat KCR, Metpally sub-collector, Musharaf Ali, IAS at MP feet, Nizamabad MP Kalvakuntla Kavitha, Telangana Republic Day Celebration, Musharaf Ali Kavitha, Kalvakuntla Kavitha Sub Collector, Kalvakuntla Kavitha Feet, IAS Kalvakuntla Kavitha, IAS praise KCR, Collectors Grateful KCR

Criticism on Telangana Collectors on their attitude at 68th republic day celebrations. Metpally sub-collector Musharaf Ali was seen sitting at the feet of Nizamabad MP Kalvakuntla Kavitha while talking to her at the VVIP gallery. Collector Sharat said in his address that he would be “ever grateful” to Chief Minister K. Chandrasekhar Rao and would “touch his feet for allowing him to participate in the RD celebrations.”

ఎంపీ కవిత కాళ్ల దగ్గర ఐఏఎస్.. తీవ్ర విమర్శలు

Posted: 01/27/2017 08:15 AM IST
Telangana collectors attitude at rd celebrations

ఐఏఎస్ అంటే ఏంటి..? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్.. అంటే ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధి! ప్రజాసేవే పరమావధిగా భావించే ఓ పవిత్రమైన వృత్తి. ఓ జిల్లాకు పెద్దన్నగా వ్యవహరిస్తూ బాధ్యతలను తన చేతులో ఉంచుకోవాల్సిన వ్యక్తి, అంతేకానీ రాజకీయనాయకుల చెప్పుచేతల్లో, వారి ఆదేశాలు మాత్రమే పాటించే వారిగా మాత్రం ఉండకూడదు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర గణతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఐఏఎస్ ల పరువు తీశారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

గ‌ణతంత్ర దినోత్స‌వ వేళ ఓ ఐఏఎస్ అధికారి ఏకంగా నిజామాబాద్ ఎంపీ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత పాదాల చెంత కూర్చుని ముచ్చ‌టించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్‌ ముషర్రఫ్‌ అలీ ఏకంగా గ్యాలరీలో కూర్చొన్న సీఎం కుమార్తె, ఎంపీ కవిత దగ్గరికి వెళ్లాడు. ఆపై ఆమెతో మాట్లాడేందుకు మోకాళ్ల మీద కాసేపు అలాగే ఉండిపోయారు.

ఇదిలా ఉంటే మరో ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలపైపై స‌ర్వ‌త్ర విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌గిత్యాల జిల్లాలోని చారిత్ర‌క ఖిల్లాలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో క‌లెక్ట‌ర్ శ‌ర‌త్ మాట్లాడుతూ త‌న‌కు ఈ అవ‌కాశం క‌ల్పించిన సీఎం కేసీఆర్‌కు పాదాభివంద‌నం చేస్తున్నానంటూ పేర్కొన‌డంతో హాజ‌రైన ప్ర‌ముఖులు అవాక్క‌య్యారు. అంతటితో ఆగకుండా జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా ఖిల్లా అభివృద్ధికి పాటు పడుతున్న నిజామాబాద్‌ ఎంపీ.. కల్వకుంట్ల కవిత గారికి శుభాభివందనాలు అన్నాడు. క‌లెక్ట‌ర్లు ఇలా రాజ‌కీయ నాయ‌కుల్లా మారిపోయి అఖిల భార‌త స‌ర్వీసుల‌కు త‌ల‌వంపులు తీసుకొచ్చారంటూ ప‌లువురు ప్ర‌ముఖులు, ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు సంధిస్తున్నాయి.

దీంతో నిన్న మొత్తం కలెక్టర్‌ శరత్‌.. సబ్‌ కలెక్టర్‌ ముషర్రఫ్‌ అలీ వ్యవహారంపైనే అంతా చర్చించుకున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ మచ్చ తెచ్చారని చర్చించుకున్నారు. ‘ఐఏఎస్‌ల తీరు.. నేతల పాదాలకు మోకరిల్లె చూడు.. పరేడ్‌ మైదానంలో ప్రజల సాక్షిగా తలవంపులు తెచ్చెను వీరు.’ అనే పోస్టు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేశాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  IAS  Republic Day  Celebrations  KCR  Kavitha  

Other Articles

Today on Telugu Wishesh