అమ్మ లాగే చిన్నమ్మ కూడా శపథం చేసిందా? | Sasikala wants to step in Assembly as CM only.

Sasikala follows jayalalithas route

AIADMK General Secretary, VS Sasikala, Sasikala Natarajan, Sasikala Jayalalitha Challenge, Sasikala as CM Assembly, Sasikala Assembly, Chinamma Sasikala, Sasikala New Resolution, Chief Minister Sasikala, Sasikala in Assembly

AIADMK general secretary VS Sasikala follows Jayalalitha's route.Chinamam wants to step in Assembly as Chief Minister only. Will be meeting party MPs on Friday to discuss the current issues and chalk out the party’s strategy for the ensuing budget session.

జయలలితలాగే శశికళ కూడానా?

Posted: 01/27/2017 09:12 AM IST
Sasikala follows jayalalithas route

తమిళనాడు ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఎట్టి పరిస్థితుత్లో తాను అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే అడుగుపెడ‌తాన‌ని స్పష్టం చేసింది. అప్ప‌టి వ‌ర‌కు అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌న‌ని, ఆ ప్రస్తావన ఇక తీసుకురావొద్దని ఆమె పార్టీ నేత‌ల వ‌ద్ద తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ఈనెల 23న తమిళనాడు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన శ‌శిక‌ళ ఆరోజు అసెంబ్లీకి వస్తార‌ని అంతా భావించారు. కీలకమైన జల్లికట్టుపై చర్చ సందర్భంగా ఆమె ఖచ్ఛితంగా ఉంటుందని ఆశించారు. వీఐపీ గ్యాల‌రీలో కూర్చుని స‌మావేశాల‌ను తిల‌కిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆమె హాజ‌రుకాలేదు. దీనిపై మరుసటి రోజు కార్యకర్తలు ఆమెను కలిశారు. అసెంబ్లీకి రావాల్సిందిగా విజ్నప్తి చేశారు కూడా. అయితే తాను ఆ పని చేయబోనని శశికళ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బాట‌లోనే తాను న‌డ‌వాల‌నుకుంటున్నాన‌ని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాతే తాను అడుగుపెడతానని తేల్చి చెప్పినట్లు స‌మాచారం.

ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలతోపాటు, రిపబ్లిక్ డే వేడుకలకు కూడా ఆమె దూరంగా ఉన్నట్లు స్పష్టమౌతోంది. మరోవైపు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో శశికళ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పన్నీర్ సెల్వం ఈరోజు ఎమ్మెల్యేలతో అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  Sasikala Natarajan  Chief Minister  Tamil Nadu  Assembly  

Other Articles