లేడీస్ క్లబ్ గా రాజ్ భవన్... అమ్మాయిలతో గవర్నర్ రాసలీలలు | Meghalaya governor quits on ladies club charge.

Meghalaya governor quits after allegations of molestation

Meghalaya News, Governor V Shanmuganathan, Shanmuganathan Molestation, Meghalaya Governor quit, Raj Bhavan Molestation, NS Tiwari V Shanmuganathan, Governor Sexual Allegations, Meghalaya Governor Sexual Allegations, V Shanmuganathan Resign, Ladies Club Governor, Raj Bhavan Ladies Club Charge

Meghalaya Governor V Shanmuganathan quits after allegations of molestation. Must face probe in sexual misconduct case, redeem prestige of office.

రాజ్ భవన్ లో గవర్నర్ రాసలీలలు

Posted: 01/27/2017 07:49 AM IST
Meghalaya governor quits after allegations of molestation

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ఎన్టీ తివారీ ఏకంగా రాజ్‌భ‌వ‌న్‌ను రాసలీల‌కు కేరాఫ్ అడ్రస్ గా మార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే హోదాలో మరో వ్యక్తి అలాంటి వ్యవహారాన్నే వెలగబెట్టాడు. ఈశాన్య రాష్ట్రమైన మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ వీ షణ్ముఖనాథన్ (67) గవర్నర్ కార్యాలయంలో అమ్మాయిలతో రాసలీలలు జరిపిన వ్యవహారం బయటికి రావటం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో ఆయన త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యాన్ని ఆయ‌న క్ల‌బ్‌గా మార్చేశార‌ని, అమ్మాయిలు నేరుగా గ‌వ‌ర్న‌ర్ ప‌డ‌క గ‌దికి వెళ్తున్నార‌ని పేర్కొంటూ రాజ్‌భ‌వ‌న్ సిబ్బంది ప్ర‌ధాని మోదీకి లేఖ రాయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ‘రాజ్‌భవన్ కు యువతులు యథేచ్ఛగా వచ్చి వెళ్తుంటారు. వారిలో చాలా మంది గవర్నర్‌ బెడ్‌రూమ్‌లోపలి వరకు డైరెక్ట్‌గా వెళ్తుంటారు. గవర్నర్‌ ఇద్దరు ప్రజాసంబంధాల అధికారులను, ఒక కుక్‌ను, రాత్రి విధుల కోసం ఒక నర్స్‌ను ప్రత్యేకంగా నియమించుకున్నారు. వారంతా మహిళలే. తన దగ్గర విధులు నిర్వహించేందుకు యువతులను మాత్రమే నియమించుకున్నారు. అధికారిక ప్రైవేటు కార్యదర్శిని సైతం తన సెక్రటేరియట్‌కు బదిలీ చేశారు’ అని ఆ లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు.

అంతేకాదు ఓ మ‌హిళ కూడా ష‌ణ్ముగ‌‌నాథ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. గ‌తేడాది రాజ్‌భ‌వ‌న్‌లోని పీఆర్వో పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌న‌తో గ‌వ‌ర్న‌ర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని, కౌగ‌లించుకుని ముద్దులు పెట్టుకోబోయార‌ని తెలిపింది. రాజ్‌భ‌వ‌న్‌ను అమ్మాయిల కార్య‌క‌లాపాల‌కు వేదిక‌గా మార్చ‌డంతోపాటు త‌మ‌ను మాన‌సిక ఒత్తిడికి, అవ‌మానాల‌కు గురిచేస్తున్న గ‌వ‌ర్న‌ర్‌ను త‌క్ష‌ణం ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ మొత్తం 98 మంది సిబ్బంది ఫిర్యాదుపై సంత‌కం చేసి ప్ర‌ధానికి పంపించారు.

ఈ ఫిర్యాదును ప్ర‌ధానితోపాటు రాష్ట్ర‌ప‌తి, కేంద్రహోంమంత్రి, మేఘాల‌య ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాల‌కు కూడా పంపారు. తొలుత ఈ ఆరోప‌ణ‌ల‌ను ష‌ణ్ముగ‌నాథ‌న్ ఖండించారు. కొంద‌రు కావాల‌నే త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ కొట్టిప‌డేశారు. అయితే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డం, ప‌ద‌వి నుంచి షణ్ముగ‌నాథ‌న్‌ను తొల‌గించాలంటూ సివిల్ సొసైటీ విమెన్ ఆర్గ‌నైజేష‌న్ సంత‌కాలు చేప‌ట్ట‌డంతో మ‌రోమార్గం లేక షణ్ముగ‌నాథ‌న్ త‌న ప‌దవికి రాజీనామా స‌మ‌ర్పించారు. తమిళనాడుకు చెందిన షణ్ముఖనాథన్ గతంలో ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా ఉన్నారు. 2015లో షణ్ముఖనాథన్ మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meghalaya  Governor  V Shanmuganathan  Quit  Molestation  Ladies Club  

Other Articles