ఆర్థిక నేరస్థుడికి కూడా కోపం వచ్చిందహో..! SEBI bars Vijay Mallya from capital markets

Vijay mallya alleges witch hunt says kingfisher airlines was not my private toy

Vijay Mallya, USL, United Spirits, sebi ban order, Kingfisher airline, kingfisher, Securities and Exchanges Board

Vijay Mallya has hit out at Sebi for barring him from securities market with regard to alleged fund diversion from United Spirits and has termed the charges against him "baseless".

ఆర్థిక నేరస్థుడికి కూడా కోపం వచ్చిందహో..!

Posted: 01/26/2017 04:59 PM IST
Vijay mallya alleges witch hunt says kingfisher airlines was not my private toy

భారీ రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యా  సీబీఐ చార్జ్ షీటు దాఖలు, సెబీ నిషేధం, తదితర పరిణామాలపై స్పందించారు.   బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యా చుట్టూ ఉచ్చుబిగుస్తూ ఉండడంతో  ట్విట్టర్ వేదికగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.  ప్రభుత్వ  ఆరోపణలన్నీ నిరాధారమైనవనీ, తనకే పాపం తెలియందంటూ పాత పల్లవే అందుకున్నారు. మంత్రగత్తెను వేటాడినట్టు తనను వెంటాడుతున్నారంటూ ట్విట్టర్ లో వాపోయారు. ఎలాంటి చట్టపరమైన సాక్ష్యాలు లేకుండానే అన్నివైపుల నుంచి వేటాడుతున్నారని వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు.

కింగ్ ఫిఫర్ అనేది తన సొంత ఆటబొమ్మకాదనీ,  దేశానికి ఎనలేని సేవ చేస్తున్న ఒక గొప్ప ప్రజా సేవల సంస్థ అని పేర్కొన్నారు. గత 30 ఏళ్ల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద మద్యం కంపెనీని, బ్రేవరేజ్ కంపెనీని, ఎయిర్ లైన్స్ ను   అందించినందుకు  తనకీ గౌరవం దక్కిందన్నారు. కింగ్ ఫిషర్  ఆస్తులను మళ్లించినట్టు  సీబీఐ చెప్పడం,  యూ ఎస్ ఎల్ నుండి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు  నిధులను  తరలించినట్టు సెబీ చెప్పడం హాస్యాస్పస్పందంగా ఉందని ట్వీట్ చేశారు.

కాగా గత ఏడాదిలో  లండన్ కు పారిపోయిన మద్యం వ్యాపారిపై చర్యలకు ప్రభుత్వం వేగంగా కదులుతోంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ  చార్జిషీట్  దాఖలు చేసింది.   మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్  నిధులను "వ్యక్తిగత ఉపయోగం"  మళ్ళించినట్టు ఆరోపించింది. అలాగే  సోమవారం 2015 రుణ డిఫాల్ట్ కేసుకు సంబంధించి ఐడిబిఐ చైర్మన్ యోగేష్ అగర్వాల్, సహా తొమ్మిది మందిని అరెస్ట్  చేసింది. అటు యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ నుంచి నిధులను అక్రమంగా మళ్లించారన్న ఆరోపణల కేసులో విజయ్‌ మాల్యా, మరో ఆరుగురిని సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ  వేటు వేసిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles