పది మంది భారత సైనికులపై ప్రకృతి పంజా 10 soldiers killed, 4 missing in 2 J&K avalanches

Kashmir avalanches kill 10 jawans heavy snowfall hits valley hard

J and K Avalanche, jammu and kashmir, Kashmir Valley, Line of Control, snowfall, soldiers killed, rescue operations, army

Ten soldiers were killed in two avalanches that hit Gurez Sector of Kashmir while the Valley remained cut off from the rest of the country due to heavy snowfall.

పది మంది భారత సైనికులపై ప్రకృతి పంజా

Posted: 01/26/2017 05:29 PM IST
Kashmir avalanches kill 10 jawans heavy snowfall hits valley hard

యావత్ భారత దేశ ప్రజలు ఇవాళ 68వ గణతంత్రదినోత్స వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న సమయంలోనే దేశ ప్రజలను ఓ విషాద వార్త కలచివేసింది. 68 ఏళ్ల గణతంత్ర వేడుకలకు కారణమైన భారతీయ జవాన్లు ఇదే శుభదినం రోజున అసువులు బాసారన్న వార్త విషాదాన్ని నింపింది. అనునిత్యం దేశాన్ని శత్రు మూకల నుంచి రక్షించే సైనికులపై ప్రకృతి కూడా ప్రకోపాన్ని చాటింది, హిమపాతం ఏకంగా పంజా విసిరింది.

గుర్జు సెక్టర్లో రెండు వేర్వేరు చోట్ల మంచు తుఫానులో చిక్కుకొని పదిమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మంచులో ఇరుక్కున్న మరో ఏడుగురు ఆర్మీ అధికారులు రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురు జవాన్ల ఆచూకీ లభించాల్సి ఉంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh