విజ్ఞత మరిచిన ఎంపీకీ ప్రియాంక చెంపపెట్టు జవాబు Priyankahits back at BJP leader Vinay Katiyar

Priyanka gandhi hits back at bjp leader vinay katiyar for his sexiest remarks

Priyanka Gandhi, congress, bjp, Vinay Katiyar, star campaigner list, Congress-SP alliance, Uttar Pradesh, up assembly elections, akilesh yadav, up polls

Congress star campaigner Priyanka Gandhi hits back on the leader and said his comments shows the BJP mindset towards India’s women.

విజ్ఞత మరిచిన ఎంపీకీ ప్రియాంక చెంపపెట్టు జవాబు

Posted: 01/25/2017 04:16 PM IST
Priyanka gandhi hits back at bjp leader vinay katiyar for his sexiest remarks

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యుడు వినయ్ కతియార్ చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ స్పందించారు. కతియార్‌ వ్యాఖ్యలు బీజేపీ నేతల మైండ్ సెట్‌ ను తెలియజేస్తున్నారని అన్నారు. మహిళలపై కమలం నాయకుల వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. మహిళలంటే చులకన భావమున్న నేతలే ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసి పబ్లిసిటీ కోసం పాకులాడుతారని చురకలంటించారు. బీజేపి పార్టీలో వున్న మహిళలకు కూడా వర్తించేలా ఎంపీ చేసిన వ్యాఖ్యలను పలు రాష్ట్రాల్లోని మహిళా కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు.

అంతకు ముందు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని పరితమంచే పార్టీకి చెందిన ఎంపీ వినయ్ కటియార్ విజ్ఞత మరిచి ప్రియాంకా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. యత్రనార్యంతు పూజ్యంతే తత్ర రమ్యతే దేవతాం అన్న సూక్తిని కూడా మర్చిన నేత.. ఆడవారిని కేవలం అందమైన వస్తువులుగానే పరిగణించే విధంగా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక కంటే అందమైన మహిళలు చాలా మంది ఉన్నారని.. ఆమె కంటే యాక్టర్లు, ఆర్టిస్టులు అందంగా ఉంటారని నోటికొచ్చినట్టు మాట్లాడారు. తమ పార్టీలో అందమైన స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఉతర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచార బాద్యతలను నిర్వహించనున్న వారి జాబితాను నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దీంతో స్టార్ క్యాంపెయినర్ గా ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారన్న విషయాన్ని జీర్ణించుకోలేక బీజేపి ఎంపీ వినయ్ కటియార్ అభ్యంతరకర వ్యాక్యలు చేశారు. తమ పార్టీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఉన్నారని, అమె మాట్లాడితే జనం కూడా అధికంగా వస్తారని అమె ప్రియాంక కన్నా చాలా అందంగా వుంటారని కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రియాంక రావడం హర్షించదగ్గ పరిణామమని నేషనల్ కాంగ్రెస్ పార్టీ పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh