హోదాపై నిరసనను అడ్డుకుంటే దీర్ఘకాలిక పోరాటమే: పవన్ కల్యాన్ Be prepared for long-drawn battle: Pawan Kalyan

Be prepared for long drawn battle pawan kalyan tells andhra government

Pawan Kalyan tells Andhra government, BattleofAndhras JanaSena, Andhra Pradesh, RK Beach here on Republic Day, AP DEMANDS SPECIAL STATUS, Chandrababu

AP government refusing to permit proposed protest by youth over special category status, popular actor Pawan Kalyan said it should be prepared for long-drawn battle..

హోదాపై నిరసనను అడ్డుకుంటే దీర్ఘకాలిక పోరాటమే: పవన్ కల్యాన్

Posted: 01/25/2017 05:04 PM IST
Be prepared for long drawn battle pawan kalyan tells andhra government

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్కే బీచ్‌లో ఉద్యమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు బాస్ సాంబశివరావు స్వయంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. సోషల్ మీడియాలో ఉద్యమాలకు పిలుపులపై అనుమతికి ఇవ్వబోమని ఖరాఖండీగా చెప్పడంపై పవన్ కల్యాన్ మరోమారు ట్విట్టర్ అనుసంధానంగా దేశంలోని పౌరులకు స్వేచ్చగా నిరసన తెలిపే హక్కు వుందన్న చెప్పారు. ఈ పోరాటానికి ప్రభుత్వానికి చెందిన మంత్రులు అభ్యంతరం తెలుపడంపూ ఆయన మండిపడ్డారు.
 
ప్రత్యేకహోదాపై ప‌వ‌న్ బుధవారం ఉదయం నుంచి గంట గంటకూ ట్వీట్ చేస్తూ ఆర్కే బీచ్ ఉద్యమంపై నిరసన వ్యక్తం చేసేవారిని ఎండగట్టారు. దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే నేతలు.. నిరసన తెలిపే స్వేచ్ఛను ఎందుకు హరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని అడ్డుకోవ‌ద్ద‌ని సూచిస్తూ.. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. తాజాగా ప‌వ‌న్ ‘యువత చెయ్యాలనుకుంటున్న ఏపీ ప్రత్యేక హోదా శాంతియుత పోరాటాన్ని ఎవరు నీరుకార్చినా, వారు రాష్ట్రయువత భవిష్యత్తుని నాశనం చెయ్యటమే...అని పవన్ పేర్కొన్నారు.
 
ప్రత్యేక హోదాపై ట్విట్టర్ ద్వారా ప్రజా ప్రతినిధుల వైఖరిపై పవన్ మండిపడ్డారు. "అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న సామెతలాగ, ఏపీ స్పెషల్ స్టేటస్ కి మీరు పోరాటం చెయ్యరు, చేసే వారిని చెయ్యనివ్వరు... మరి ఎలా?" అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, గురువారం విశాఖపట్నం ఆర్కే బీచ్, విజయవాడ కృష్ణా తీరం, తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ప్రాంగణాల్లో యువత ర్యాలీలకు, నిరసన ప్రదర్శనలకు నిర్ణయించగా, అందుకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే
 
ఈ నేపథ్యంలో జనసేనాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేశారు. బాబును టార్గెట్ చేస్తూ పవన్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యేక హోదా, జల్లికట్టు ఉద్యమానికి సంబంధం ఏంటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన ప్రశ్నకు పవన్ స్పందించారు. జల్లికట్టు స్ఫూర్తితో యువత ముందుకు వస్తున్నప్పుడు కుదిరితే యువతకు సహకరించాలని పవన్ కోరారు. అంతేకానీ, వెనక్కిలాగే వ్యాఖ్యలు చేయకండని హితవు పలికారు. ఆ తరువాత మరో ట్విట్టులో రేపటి నిరసన తెలిపే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తే.. హోదా కోసం, హక్కుల కోసం దీర్ఘకాలిక పోరుకు సన్నధం కావాల్సి వస్తుందని పవన్ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  special status  battle of andhras  jana sena  R.K. beach  chandra babu  andhra pradesh  

Other Articles