జల్లికట్టుపై మార్కండేయ కట్జూ ఆసక్తికర వ్యాఖ్యలు.. state law prevails over centre says markandey katju

State law prevails over centre says markandey katju

Markandey Katju, Supreme Court, Tamil Nadu, Government, Ordinance, Legislature, Governor, Concurrent List, Prevention of Cruelty to Animals, PCA, Constitution, O Panneerselvam, Alanganallur, Jallikattu

“Under Article 254 (2) of the Constitution, the state law will prevail over the central on two grounds – because it comes after the central law and it because it received the assent of the President.” says katju

జల్లికట్టుపై మార్కండేయ కట్జూ ఆసక్తికర వ్యాఖ్యలు..

Posted: 01/25/2017 03:42 PM IST
State law prevails over centre says markandey katju

తమ సాంప్రదాయ క్రీడైన జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కావాలని, తాత్కాలికమైన ఆర్డనెన్సులు వద్దని తమిళనాడులో యువత అందోళలను చేపడుతున్న క్రమంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జూ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అర్డినెన్సు దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తుందని అనుమానాల నేపథ్యంలో ఆయన కుండబద్దలు కొడుతూ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అర్డినెన్సు తాత్కాలికమైనదని అన్నారు.

అయితే ఈ అర్డినెన్సును తమిళనాడు ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి అమెదించిన పక్షంలో అది చట్టంగా మారుతుందని కట్జూ అన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమోదించిన బిల్లును కూడా దేశసర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం వున్నప్పటికీ రాజ్యంగంలోని అధికారణ 254(2) ప్రకారం జల్లికట్లు బిల్లుకు రక్షణ లభిస్తుందని అయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన ఆయన తమిళనాడు యువత ఈ విషయంలో అందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

అయితే జంతువుల పరిరక్షణ చట్టం కింద జల్లికట్టు వస్తున్నందున పార్లమెంటు చట్టం కన్నా తమిళనాడు సర్కారు చేసిన చట్టమే ఈ విషయంలో బలమైందని పేర్కోన్నారు. పశువులను పరిరక్షణ చట్టం ప్రకారం రాజ్యంగంలోని అధికారణ 254(2) మేరకు కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వ చట్టానికే ప్రాధాన్యత అధికమని ఆయన చెప్పారు. ఇందుకు రెండు కారణాలున్నాయన్నారు. ఒకటి జంతు సంరక్షణ చట్టం ప్రకారం కేంద్రం తరువాత రాష్ట్ర ప్రభుత్వ చట్టం వస్తుందని, దీంతో పాటు రాష్ట్రపతి అసెంట్ కూడా లభించిందన్నారు. దీనిని ఏ న్యాయస్థానంలో సవాల్ చేసినా.. సక్సెస్ కాలేరని కట్జూ అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా, జల్లికట్టును పునరుద్ధరిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయడాన్ని, ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి చట్టంగా రూపొందించచడాన్ని సవాలు చేస్తూ జంతు సంక్షమ బోర్డు (ఆనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా- ఏడబ్ల్యూబీఐ), అంతర్జాతీయ జంతు కారుణ్య సంస్థ (పెటా) సహా ఇతర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరిచింది. ‘జనవరి 30న జల్లికట్టుపై వేసిన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

జల్లికట్టు పేరుతో జంతువులను యధేచ్ఛగా హింసిస్తున్నారంటూ పెటా వ్యక్తం చేసిన వాదనను సమర్థించిన కోర్టు.. గత ఏడాది చివర్లో సంప్రదాయ క్రీడను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే జల్లికట్టు సంక్రాతి(పొంగల్‌) సందర్భంగా నిర్వహించే క్రీడ కావడంతో పండుగ వేళ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. మెరీనా బీచ్‌ వేదికగా గతవారం భారీ నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం హుటాహుటిన ఆర్డినెన్స్‌ జారీచేసింది. మరునాడే అసెంబ్లీలో జల్లికట్టుకు అనుకూలంగా తీర్మానం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jallikattu  ordinance  state law  central law  prevail  centre  president  markandey katju  supreme court  animals  cruelity  peta  

Other Articles